iDreamPost

బాలకృష్ణ కూతురివి అయితే ఎవడికి గొప్ప.. ముందు అది తెలుసుకో : మంత్రి రోజా

బాలకృష్ణ కూతురివి అయితే ఎవడికి గొప్ప.. ముందు అది తెలుసుకో : మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకూ హీట్ పుట్టిస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీడీపీ శ్రేణులు హంగామా చేసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగారు నారా చంద్రబాబు సతీమణి, బాలకృష్ణ తనయ, నారా వారి కోడలు బ్రాహ్మణి. వైసీపీ ప్రభుత్వంపై, జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో వైసీపీ మహిళా నేత, మంత్రి రోజాపై నోరు పారేసుకున్నాడు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. మహిళా అని చూడకుండా, అత్యంత హేయంగా, అవమానకర రీతిలో, జుగుప్పాకరమైన భాషలో ఆమెపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మకు ఫిర్యాదులు అందగా.. అతడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసిన సంగతి విదితమే. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, తనపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. అదే సమయంలో నారా బ్రాహ్మణిని సైతం సొంత పార్టీ నేత అయ్యన్న పాత్రుడు ‘అది ఎవరంటూ’ అనడంపై కూడా మండిపడ్డారు. ‘నువ్వు ఎవ్వరూ నా క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి, నీకైం రైట్స్ ఉంది. ఈ రోజు లోకేశ్ తెలుసుకోవాలి.. బండారు సత్యనారాయణ, అయ్యన్న పాత్రుడు వంటి వారిని నువ్వు ఎంకరేజ్ చేసి నన్ను తిట్టించి, నా నోరు మూయించాలనుకున్నావ్. కానీ ఈ రోజు నీ పరిస్థితి ఏంటైంది. అదే అయ్యన్న పాత్రుడు.. నీ భార్యను.. బాలకృష్ణ కూతురు.. అది ఎవరు.. దాని పేరేంటీ అన్నాడు. ఎప్పుడు కూడా ఒకరిపై దుమ్మెత్తి పోయాలని భావిస్తే.. అది నీ కళ్లల్లో పడుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి నీ పెళ్లానికి వచ్చింది. బ్రాహ్మణీ కూడా ఇది తెలుసుకోవాలి’ అంటూ పేర్కొన్నారు.

‘నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు.. బ్రాహ్మణి చిన్న పాప. ఈ పాపకు జడలు వేయాలంటే మేమే వేయాలి. పక్కన కూర్బొబెట్టుకుని ఆడించుకునే వాళ్లం. అందుకే ఆ రోజు చెప్పాం..ఆమె పాలిటిక్స్ మాట్లాడలేదు కాబట్టి.. మేము మాట్లాడలేదు. ఈ రోజు మామ, భర్త ఇచ్చిన స్క్రిప్ట్ రాసిస్తే.. జగన్ ను సైకో అని తిడితే మేం ఎలా ఊరుకుంటాం. అమెరికాలో చదువుకుంటే అబద్దాలు చెప్పొచ్చా? బాలకృష్ణ కూతురు అయితే అబద్దాలు చెప్పొచ్చా? ఇవి అబద్దాలు అని మేం చెబితే.. మామీద దుమ్మెత్తి పోస్తున్నారు. దొంగలా దొరికిన చంద్రబాబును కోర్టులు జైల్లో పెట్టాయి. 2017లో జీఎస్టీ లెటర్ ఇచ్చింది. చంద్రబాబు ఇంటిపై రైడ్, నోటీసులు,అరెస్టులు, ఐటీ నోటీసులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలే ఇదంతా చేయగా.. జగన్ మోహన్ రెడ్డి ఏదో నేరం చేశాడని ఆయనపై ఎందుకు ఏడుస్తున్నారు’అని మండిపడ్డారు.

మీరు తప్పు చేయకపోతే.. కోర్టులో ప్రూఫ్ చూపించండి. జగన్ ను ఏ మాట పడితే ఆ మాట అంటే.. దాన్ని ఖండిస్తే.. మా క్యారెక్టర్ బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. బండారు సత్యనారాయణ లాంటి వాళ్లు మాట్లాడుతున్న మాటల వల్ల మహిళలు భయపడుతున్నారు. రేపు మా, మీ ఆడపిల్లలో వాళ్ల కలలు సాకారం చేయడానికి ఎలా బయటికి వస్తారు? వారు రేపు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సినిమా ఆర్టిస్ట్, రాజకీయ నేతలు కావాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో, మన క్యారెక్టర్ పై ఏం బురద జల్లుతారో భయంతో మళ్లీ వంటింటికే పరిమితం కావాలా? అని మంత్రి రోజా భావోద్వేగంతో కూడిన ప్రశ్నలు సంధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి