iDreamPost

ఆ దేశంలో మాస్కు ధరించకుంటే జరిమానా ఎంతో తెలుసా?

ఆ దేశంలో మాస్కు ధరించకుంటే జరిమానా ఎంతో తెలుసా?

ప్రపంచ దేశాల్లో తీవ్రంగా కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో 46 లక్షల మందికి కరోనా సోకగా మూడు లక్షల మందికి పైగా మరణించారు. కాగా కరోనాను కట్టడి చేయడానికి ఖతార్ దేశ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప్రజలంతా ముఖాల‌కు మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు మీరి మాస్క్ ధరించకుండా బయటకు వస్తే అక్షరాలా 42 లక్షల రూపాయల(రెండు లక్షల రియాళ్లు) భారీ జరిమానా విధిస్తామని ఖతార్ ప్రభుత్వం వెల్లడించింది. జరిమానాతో పాటుగా మూడేళ్లు జైలుశిక్ష విధిస్తామని ప్రజలను హెచ్చరించింది.

ఖతార్ దేశంలో 28,000 మంది వైరస్ బారిన పడగా 14 మంది మృత్యువాత పడ్డారు.. తాజాగా గురువారం ఒక్కరోజునే 1733 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాపించకుండా భౌతికదూరం పాటించకుండా మాస్కులు ధరించని వారికి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని హెచ్చరించింది. దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు బార్స్‌, రెస్టారెంట్స్‌, సినిమా హాళ్లు, మ‌సీదుల‌ను మూసివేసింది. నిర్మాణ రంగ ప‌నుల‌కు మాత్రం ఖ‌తార్ మిన‌హాయింపు ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి