iDreamPost

టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా? ధోని ఏమన్నాడంటే..!

  • Author singhj Published - 04:57 PM, Fri - 27 October 23

వరుస విజయాలతో వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్న టీమిండియా ఈసారి కప్పు గెలిచే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మాజీ కెప్టెన్​ను ధోనీని అడిగితే అతడు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ మిస్టర్ కూల్ ఏమన్నాడంటే..?

వరుస విజయాలతో వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్న టీమిండియా ఈసారి కప్పు గెలిచే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మాజీ కెప్టెన్​ను ధోనీని అడిగితే అతడు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ మిస్టర్ కూల్ ఏమన్నాడంటే..?

  • Author singhj Published - 04:57 PM, Fri - 27 October 23
టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందా? ధోని ఏమన్నాడంటే..!

వన్డే వరల్డ్ కప్​-2023లో ఓటమనేదే లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా మరో రెండ్రోజుల్లో ఇంగ్లండ్​తో తలపడనుంది. లక్నో వేదికగా జరిగే మ్యాచ్​ ఇరు టీమ్స్​కు కీలకం కానుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇంగ్లీష్ టీమ్​ ఈ మ్యాచ్​లో గెలవడం తప్పనిసరి. ఒకవేళ నెగ్గినా సెమీస్ ఛాన్సులు అంతంతే. కానీ భారత్​ ఈ మ్యాచ్​లో గెలిస్తే మాత్రం సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అందుకే రెండు టీమ్స్ ఈ మ్యాచ్​ను ఫుల్ సీరియస్​గా తీసుకుంటున్నాయి. రోహిత్ శర్మ పర్సనల్ పెర్ఫార్మెన్స్​తో పాటు టీమ్​ను కెప్టెన్​గా ముందుండి నడిపిస్తున్న తీరు భారత్​పై మరిన్ని ఎక్స్​పెక్టేషన్స్​ను పెంచుతోంది.

అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్​గా కనిపిస్తున్న టీమిండియా.. ఇప్పుడు ఉన్న జోరును ఇలాగే కంటిన్యూ చేస్తే ఛాంపియన్​గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా రోహిత్ సేన వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత లెజెండ్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా ప్రపంచ కప్ అవకాశాలపై స్పందించాడు. ప్రస్తుత వరల్డ్ కప్​లో ఆడుతున్న ఇండియన్ టీమ్ ఎంతో బాగుందన్నాడు ధోని. మంచి బ్యాలెన్స్​తో అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోందన్నాడు.

‘టీమిండియా మంచి బ్యాలెన్స్​తో ఉంది. ప్లేయర్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్​లోనూ నెగ్గుతూ ముందుకు వెళ్తున్నారు. ఇంతకంటే ఎక్కువ చెప్పను. కచ్చితంగా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. 2019లో సెమీస్​లో ఓడిపోవడం ఇప్పటికీ బాధిస్తోంది. ఆ టైమ్​లో ఎమోషన్స్​ను కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే. టీమిండియా తరఫున అదే నా లాస్ట్ మ్యాచ్. అప్పటికే నా మైండ్​లో వీడ్కోలు చెప్పాలని భావించా. కానీ ఏడాది తర్వాత ప్రకటించా’ అని ధోని చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియా రీసెంట్​ ఫామ్, ప్లేయర్ల ఆటతీరు గురించి చెబుతూ అంతా శుభం జరుగుతుందని ధోని చెప్పడంతో భారత ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఆ ఒక్క మాట చాలు మాహీ.. ఇక కప్పు మనదేనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వరల్డ్ కప్​ను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: సెమీస్‌కు చేరడంపై పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి