iDreamPost
android-app
ios-app

ఈటల రాజేందర్‌ సంచలన​ ప్రకటన.. సీఎంపై పోటీ!

  • Published Oct 12, 2023 | 7:35 PM Updated Updated Oct 12, 2023 | 7:35 PM
  • Published Oct 12, 2023 | 7:35 PMUpdated Oct 12, 2023 | 7:35 PM
ఈటల రాజేందర్‌ సంచలన​ ప్రకటన.. సీఎంపై పోటీ!

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా పార్టీలు కొత్త కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులపై పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు కేసీఆర్‌ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తానన్నారు. గురువారం ఆయన హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారికి ఎన్నికల విషయమై దిశానిర్థేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను నా నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కేసీఆర్‌పై కూడా పోటీ చేస్తాను’’ అని తేల్చిచెప్పారు.

కాగా, ఈటల రాజేందర్‌ సతీమణి జమున కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేస్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ ప్రచారానికి ఈటల సంచలన ప్రకటనతో క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ఈటల కేసీఆర్‌పై పోటీ చేయటానికి బీజేపీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారనుందనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. మరి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet