iDreamPost

Success Story: ఒకప్పుడు పేదరికంతో నరకం.. ఓ చిన్న ఆలోచన ఇతన్ని కోటీశ్వరుడిగా మార్చింది!

పేదరికంలో పుట్టడం మన తప్పుకాదు.. పేదరికంలో మరణించడం మాత్రం మన తప్పే. ఎంతో మంది పేదరికంలో పుట్టి.. తమ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్ని జీవితంలో విజయం సాధిస్తుంటారు. అలానే ఓ యువకుడు పేదరికంలో పుట్టినా.. ఓ చిన్న ఆలోచనను అమలు చేసి.. కోటిశ్వరుడిగా మారి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచాడు.

పేదరికంలో పుట్టడం మన తప్పుకాదు.. పేదరికంలో మరణించడం మాత్రం మన తప్పే. ఎంతో మంది పేదరికంలో పుట్టి.. తమ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్ని జీవితంలో విజయం సాధిస్తుంటారు. అలానే ఓ యువకుడు పేదరికంలో పుట్టినా.. ఓ చిన్న ఆలోచనను అమలు చేసి.. కోటిశ్వరుడిగా మారి నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచాడు.

Success Story: ఒకప్పుడు పేదరికంతో నరకం.. ఓ చిన్న ఆలోచన ఇతన్ని కోటీశ్వరుడిగా మార్చింది!

ప్రతి మనిషికి బాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకే రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అలానే ఈ మధ్య కాలంలోడబ్బుల సంపాదన వేటలో బంధాలు, అనుబంధాలు, లైఫ్‌ రిస్క్‌ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గంటల కొద్ది పని చేసినా సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ, ఓ వ్యక్తి రోజుకు కేవలం 20 నిమిషాలే పని చేస్తాడు. అతని సంపాదన మాత్రం కోట్లల్లో ఉంది. సంవత్సరానికి ఏకంగా 3.8 కోట్ల రూపాయలు అర్జిస్తున్నాడు. మరి… ఆ వ్యక్తి ఎవరు.. ఆయన విజయ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓర్లాండ్ ప్రాంతంలో ఫ్రాన్సిస్కో రివెరా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అతడు 2023 ఫిబ్రవరి వరకు ఆన్ లైన్ ట్యూటర్ గా  పని చేస్తూ ఉపాధి పొందాడు. అలా ట్యూటర్ గా పని చేస్తూనే మరోవైపు స్కూల్ లో టీచర్ గా పని చేసేవాడు. ఇలా ఎంత కష్టపడినా వస్తున్న ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రివెరా అసంతృప్తితో ఉండి.. ఇంకా బాగా సంపాదించాలని భావించాడు. ఇక ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించడం ప్రారంభించారు.

ఈ క్రమంలోనే అతనికి ఆర్గానిక్‌ క్యాండిల్స్‌ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. అలా కేవలం తయారు చేయడంతో పాటు విక్రయించాలని భావించాడు. ఇక ఆర్గానికి క్యాండిల్స్ తయారీలో శిక్షణ తీసుకున్నాడు. అలానే ఆన్‌లైన్‌లో ఎలా విక్రయించాలి, వస్తువును ఎలా రూపొందించాలి అనే అంశాలపై పట్టు సాధించాడు. ఆ తరువాత ఆన్ లైన్ ద్వారా బిజినెస్ విస్తరించి..ఏడాది తిరిగేలోగా రూ.3.8 కోట్ల సంపాదన చేరుకున్నారు. ప్రతీ అమ్మకంలో దాదాపు 30శాతం నుంచి 50శాతం లాభం రివెరా అందుకుంటున్నాడు.

ఈ వస్తువును రూపొందించి.. మార్కెట్ లోకి విడుదల చేసే వరకు రివెరా అలుపెరగకుండా కష్టపడ్డాడు. ప్రస్తుతం రోజుకు కేవలం 20 నిమిషాలే పనిచేస్తున్నాడు. ఒక్కోరోజు రెండు నుంచి మూడు గంటలు పనిచేస్తాడు. లేబుల్‌ డిజైన్‌ కోసం కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపాడు. ఇక మిగతా సమయంలో సంగీతం వింటూ గడిపేస్తున్నాడు. ప్రస్తుతం తాను గతంలో కన్నా తక్కువ పనిచేసి ఎక్కువ సంపాదిస్తున్నానని రివెరా పేర్కొన్నారు. మొత్తంగా రివెరా.. ఇప్పుడు తన బిజినెస్ ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాడు. అంతేకాక అతడి కింద పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

బిజినెస్ ప్రారంభించిన మొదట్లో చాలా గంటలు కష్టపడి పని చేసిన రవెరా.. విస్తరించిన తరువాత కేవలం 20 నిమిషాలు మాత్రమే పని చేస్తూ.. ఇలా కోట్ల ఆదాయం అర్జిస్తున్నారు. పేదరికం నుంచి ధనవంతుడిగా మారి.. వ్యాపారం చేయాలనే వారికి స్పూర్తిగా నిలిచాడు. మొత్తంగా రిస్క్ తీసుకుని కొత్త బిజినెస్ స్టార్ చేసి…విజయం సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. బిజినెస్ ప్రారంభంలో ఎక్కువ కష్టపడితే.. ఆతరువాత తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించ వచ్చని రివెరా లైఫ్ ఉదాహరణ అని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి