iDreamPost

గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం!

గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం!

మృత్యువు అనేది ఎప్పుడు ఎలా ముంచుకు వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల రసాయన పరిశ్రమలు, గ్యాస్ స్టేషన్లలో ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భద్రతా నియమాలు పాటించాలని చెబుతున్నప్పటికీ కొన్ని పరిశ్రమల్లో నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే..

అర్మేనియా లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించడంతో సుమారు 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఈ దుర్ఘటన నాగర్నో-కారాబఖ్ ప్రాంతంలో మంగళవారం జరిగింది.

గత కొంత కాలంగా నాగర్నో-కారాబఖ్ ప్రాంతంలో అర్మేనియా సైనికులపై లజర్ బైజాన్ సైన్యం దాడులు నిర్వహిస్తుంది. మూడు దశాబ్దాల వేర్పాలు వాద పాలన తర్వాత అజర్ బైజాన్ సైన్యం ఈ ప్రాంతాన్ని తిరిగి తమ స్వాధీనం చేసుకునేందుకు భీకర పోరు కొనసాగిస్తుంది. ఆర్మేనియా-అజర్ బైజాన్ సైన్యం మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతుంది. యుద్దం కారణంగా తమ ప్రాణాలకు హాని ఉందనే భయంతో వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడి ఆర్మేనియాకు వలస వెళ్లిపోతున్నారు. ఈక్రమంలోనే ఓ గ్యాస్ స్టేషన్ వద్ద వాహనదారులు క్యూ కట్టారు. ఆ సమయంలో ఒక్కసారిగే గ్యాస్ స్టేషన్ పేలుడు సంభవించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.