iDreamPost

వీడియో కాల్ చేస్తే ఖాతా ఖాళీ.. మార్కెట్ లో నయా మోసం!

మారుతున్న టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆర్థక లావాదేవీల విషయంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే అదే తరుణంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మార్కెట్ లోకి కొత్త తరహా మోసం ఒకటి వచ్చింది.

మారుతున్న టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆర్థక లావాదేవీల విషయంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే అదే తరుణంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మార్కెట్ లోకి కొత్త తరహా మోసం ఒకటి వచ్చింది.

వీడియో కాల్ చేస్తే ఖాతా ఖాళీ.. మార్కెట్ లో నయా మోసం!

సాధారణంగా టెక్నాలజీ ఎంత పెరుగుతోందో.. అలాగే స్కాములు కూడా పెరుగుతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని స్కామర్ల పాలు చేసిన వాళ్లు అవుతారు. గతంలో అంటే ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చేది. లాటరీ గెలిచారు ఈ లింక్ పై క్లిక్ చేయండి అనేవాళ్లు. తెలియనివాళ్లు క్లిక్ చేసి చేతులు కాల్చుకునేవాళ్లు. ఆ తర్వాత మీ బిల్ పేమెంట్ ఇదే చివరి రోజు అంటూ మెసేజ్ లు చేశారు. కంగారుగా ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ అయ్యేది. ఇలాంటి వాటికి జనాలు పడటం లేదని.. స్కామర్లు కూడా రూటు మార్చారు. సరికొత్త తరహా మోసాలు మొదలు పెట్టారు. వాటిలో వీడియో కాల్ స్కామ్ కూడా ఒకటి.

సాధారణంగా ఆన్ లైన్ షాపింగ్ కి సంబంధించి స్పెషల్ సేల్స్ ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ సేల్స్ లో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ అతి తక్కువ ధరలకు దొరికే అవకాశం ఉంటుంది. ఈ సేల్స్ లో అందరూ షాపింగ్ చేయాలి అనే కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి ఒక సందర్భాన్ని అవకాశంగా మార్చుకుని స్కామర్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మీ ఫోన్ నంబర్ కు ఒక ఫోన్ వస్తుంది. మేము ఫలానా ఈ- కామర్స్ సైట్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు ఒక ఒక ఆఫర్ ఉంది. ఐఫోన్ ని సగం ధరకే అందిస్తున్నాం అంటారు. అది వినగానే మీరు కచ్చితంగా స్కామ్ అని కనిపెట్టేస్తారు. వెంటనే కాల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు వాళ్లను ఏంటి నన్ను మోసం చేయాలి అని చూస్తున్నావా? పట్టేయ్ ఫోన్ అని కూడా అనచ్చు.

అక్కడి నుంచే వాళ్ల ప్లాన్ ని స్టార్ట్ చేస్తారు. నిజానికి మీరు గెస్ చేసింది కరెక్టే.. వాళ్లు నిజంగానే స్కామర్లు. అయితే వాళ్లు మిమ్మల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు. మేము ఎలాంటి స్కామ్ చేయడం లేదు. మీ ఇంటికే ఐఫోన్ వస్తుంది. అది మీరు రిసీవ్ చేసుకోండి. ఈ ఆఫర్ కు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. మీ చేతికి ఫోన్ వచ్చిన తర్వాతే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అని చెబుతారు. అది విన్న తర్వాత కచ్చితంగా ఎవరైనా కూడా టెంట్ అవుతారు. ఆ ఆఫర్ ని చేజిక్కించుకోవాలి అనుకుంటారు. ఆ బలహీన క్షణాలను ఆసరాగా చేసుకునే స్కామర్లు మీ ఖాతాను ఖాళీ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే.. మీరు ఆ ఆఫర్ కి ఓకే చెప్పగానే మీకు ఓ ప్రశ్న ఎదురవుతుంది. సార్.. మీకు ఆఫర్ ఇవ్వాలి అంటే ఆ ఫోన్ కొనగలిగేందుకు.. మీ ఖాతాలో డబ్బు ఉందా అనేది మాకు తెలియాలి అంటారు. అందుకు మిమ్మల్ని వీడియో కాల్ చేయమంటారు. మీరు వీడియో కాల్ ద్వారా వారికి మీ ఖాతా వివరాలు చూపిస్తారు.

మీ ఖాతా వివరాలను చూపించే క్రమంలో మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ వాళ్లకు తెలిసిపోతుంది. వాళ్లు వెంటనే వాటిని ట్రాన్సఫర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా మనీ ట్రాన్సఫర్ చేయాలి అంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఇప్పటికే వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి.. పాపప్ రూపంలో వచ్చే ఓటీపీని వాళ్లు చూసేసి కాపీ చేస్తారు. ఇంకేముంది.. మీ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఒక్క వీడియో కాల్ తో ఖాళీ చేస్తారనమాట. ఇక్కడ మీరు సగం ధరకే ఐఫోన్ వస్తుందనో, మరో వస్తువు ఇస్తారనో ఆశ పడ్డారు అంటే మీ ఖాతా ఖాళీ చేసేస్తారు. కాబట్టి ఎలాంటి సేల్స్ ఉన్నా, ఆఫర్స్ ఉన్నా కూడా ఇ-కామర్స్ సైట్స్ వాళ్లు ఫోన్ చేసి చెప్పరు. ఒకవేళ మరే స్టోర్ పేరు చెప్పి మీకు ఆఫర్ ఇస్తాను అన్నా కూడా డైరెక్ట్ స్టోర్ కే వచ్చి కొంటామని చెప్పండి. మరీ ముఖ్యంగా వీడియో కాల్ చేసి బ్యాలెన్స్ చూపించమంటే అస్సలు చూపించకండి. ఇలాంటి స్కాముల నుంచి మీరు మాత్రమే కాకుండా మీ వాళ్లను కూడా సురక్షితంగా ఉంచేందుకు ఈ విషయాన్ని మీ వాళ్లతో షేర్ చేసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి