iDreamPost

లోన్స్- క్రెడిట్ కార్డ్ అంటూ స్పామ్ కాల్స్ వస్తున్నాయా? ఇలా చేయండి..

How To Block Spam Calls: పొద్దున లేస్తే బ్యాంకు, క్రెడిట్ కార్డ్, లోన్స్ అంటూ స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ చిన్న పని చేయండి.

How To Block Spam Calls: పొద్దున లేస్తే బ్యాంకు, క్రెడిట్ కార్డ్, లోన్స్ అంటూ స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ చిన్న పని చేయండి.

లోన్స్- క్రెడిట్ కార్డ్ అంటూ స్పామ్ కాల్స్ వస్తున్నాయా? ఇలా చేయండి..

ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎప్పుడూ మన చేతిలో ఫోన్ ఉంటుంది. కాల్స్, మెసేజెస్ అంటూ ప్రతి అవసరానికి ఫోన్ వాడుతూ ఉంటాం. కానీ, మనకు వచ్చే చాలా కాల్స్ లో పనికొచ్చేవి కంటే విసిగించేవే ఎక్కువగా ఉంటాయి. మీకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంది, మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ అందుబాటులో ఉంది అంటూ తెగ విసిగిస్తూ ఉంటారు. అదే అండి.. స్పామ్ కాల్స్ గురించి చెప్తున్నాం. చాలామందికి స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి. కానీ, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి చాలామందికి తెలియదు. ఇలా చేయండి.. మీకు ఈ స్పామ్ కాల్స్ బాధ ఉండదు.

స్పామ్ కాల్స్.. ఇప్పుడు దేశంలో ఎంతోమందికి ఉన్న అతి పెద్ద సమస్య ఇది. ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఫోన్ మోగూతుంది. ఎవరా అని కంగారుగా ఫోన్ ఎత్తగానే.. “హెలో సార్ మేము ఇండస్ బ్యాంక్ నుంచ్ కాల్ చేస్తున్నాం. మీకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఎలిజిబిలిటీ ఉంది” అంటారు. వద్దండి అని ఒకసారి చెప్తారు.. రెండుసార్లు చెప్తారు. కానీ, ట్రిప్పుకి ఒక్కొక్కరు చొప్పున రోజుకు నలుగురు ఫోన్ చేస్తారు. ఒక్క ఇండస్ బ్యాంకే కాదు.. మనకు చాలానే బ్యాంకులు ఉన్నాయి. ఇలాంటి కాల్స్ అనేకం వస్తూ ఉంటాయి. మీరు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసే సమయంలోనే బ్యాంకు నుంచి కాల్స్ చేయడానికి తప్పక పర్మిషన్ ఇస్తాం. ఆ అనుమతిని థర్డ్ పార్టీలకు కూడా వాడేస్తూ ఉంటారు. మరి.. ఇలాంటి స్పామ్ కాల్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ చిన్న పని చేసేయండి మీకు ఎలాంటి స్పామ్ కాల్స్ రావు.

DND సర్వీస్:

మొబైల్ నెట్ వర్క్స్ లో డునాట్ డిస్టర్బ్ అనే సర్వీస్ ఉంటుంది. ఈ సర్వీస్ ద్వారా మనకు ఎలాంటి ఎల్లో పేజెస్, సర్వీసెస్ నుంచి కాల్స్ రాకుండా డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఈ సర్వీస్ ఆన్ చేస్తే బ్యాంకు నుంచి కావాల్సిన మెసేజెస్, కాల్స్ రావు అని కంగారు పడతారు. కానీ, డునాట్ డిస్టర్బ్ సర్వీస్ కు వాటికి సంబంధం ఉండదు. మీరు డీఎన్డీ సర్వీస్ యాక్టివేట్ చేసనా కూడా బ్యాంకు నుంచి రావాల్సిన ఓటీపీలు, కాల్స్ వస్తాయి. కాబట్టి నిశ్చింతగా మీరు ఈ డునాట్ డిస్టర్బ్ సర్వీస్ ని యాక్టివేట్ చేయచ్చు. ఈ సర్వీస్ ని మీరు చాలా సింపుల్ గా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందుకు చాలానే మార్గాలు ఉన్నాయి. మరి.. అవేంటో చూద్దాం.

DND సర్వీస్ ఎలా యాక్టివేట్ చేయాలి?:

DND సర్వీస్ ని మీరు మెసేజ్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలి అంటే 1909 నంబరుకు ‘START స్పేస్ 0’ అని టైప్ చేసి పంపిస్తే మీ నంబరు మీద డునాట్ డిస్టర్బ్ సర్వీస్ యాక్టవేట్ అవుతుంది. అలాగే మీరు కాల్ ద్వారా కూడా డీఎన్డీ సర్వీస్ ని యాక్టివేట్ చేయచ్చు. మీరు మీ ఫోన్ నుంచి 1909 నంబరుకు కాల్ చేసి ఈ సర్వీస్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు జియో నంబరు వాడుతుంటే గనుక.. మై జియో యాప్ నుంచి ఈ డీఎన్డీ సర్వీస్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మై జియో యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి.. డీఎన్డీ సర్వీస్ ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఇవన్నీ చేసినా.. మీకు ఒక పర్టిక్యులర్ బ్యాంక్ నుంచి కాల్స్ వస్తుంటే.. ఇంకో పని చేయచ్చు. ఉదాహరణకు మీకు HDFC నుంచి రిపీటెడ్ గా స్పామ్ కాల్స్ వస్తున్నాయి. అప్పుడు మీరు గూగుల్ లో HDFC స్పేస్ DND అలి టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ క్లిక్ చేసి.. మీ వివరాలను ఇస్తే ఆ బ్యాంక్ నుంచి కాల్స్ రాకుండా ఉంటాయి. ఇలా ఏ బ్యాంకు నుంచి కాల్స్ వద్దు అనుకుంటే ఆ బ్యాంక్ నేమ్ టైప్ చేసి ఈ సర్వీస్ ని యాక్టివేట్ చేయచ్చు. మరి.. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి వారిని ఈ స్పామ్ కాల్స్ నుంచి కాపాడండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి