iDreamPost

December 10th Releases : డిసెంబర్ 10 – సందడి ఉంది కానీ

December 10th Releases : డిసెంబర్ 10 – సందడి ఉంది కానీ

ఒకపక్క థియేటర్లలో అఖండ కలెక్షన్ల జాతర కొనసాగుతోంది. మరోపక్క కొత్త శుక్రవారానికి బాక్సాఫీస్ ముస్తాబవుతోంది. పుష్పకు ఏడు రోజుల ముందు వస్తున్న వీకెండ్ కావడంతో ఈ ఫ్రైడే వచ్చే చిత్రాలకు ఓపెనింగ్స్ చాలా కీలకంగా మారబోతున్నాయి. డిసెంబర్ 10న వస్తున్న వాటిలో అందరి దృష్టిలో ప్రధానంగా ఉన్నది లక్ష్య మాత్రమే. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డాడు. సుబ్రమణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన లక్ష్యకు మాస్ ఆడియన్స్ అండ ఏ మేరకు ఉంటుందో చూడాలి. జగపతిబాబు, సచిన్ కెద్కర్, రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ లాంటి క్యాస్టింగ్ ఆసక్తిని రేపుతోంది.

ఇక ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన గమనం కూడా అదే రోజు రానుంది. శ్రియ ప్రధాన పాత్ర పోషించగా ఇళయరాజా సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు లాంటి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ దీనికి బలంగా నిలుస్తోంది. అర్బన్ ఆడియన్స్ ని ఓ మాదిరిగా ఆకర్షించినా రూరల్ ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి కూడా ఇదే డేట్ షెడ్యూల్ చేసుకున్నప్పటికీ ఏవో కారణాల వల్ల డిసెంబర్ 31కి షిఫ్ట్ అయ్యింది. సో ఒక పోటీ తగ్గినట్టే. ఇవి కాకుండా మల్టీ లాంగ్వేజ్ మూవీ మడ్డీ, నయీమ్ డైరీస్, మన ఊరి పాండవులు, కటారి కృష్ణ, ప్రియతమా, బులెట్ సత్యం కూడా వస్తున్నాయి.

నెంబర్ గ్రాండ్ గా కనిపిస్తోంది కానీ ఓపెనింగ్స్ విషయంలో ధీమాగా కనిపిస్తోంది లక్ష్య ఒక్కటే. కాకపోతే స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి అఖండ కంటే ఇది బెస్ట్ ఛాయస్ అనిపించే కారణాలు చూపించగలగాలి. బాలయ్య అవలీలగా యాభై కోట్లు దాటేశారనేది పాజిటివ్ గానే కనిపిస్తోంది కానీ ఇలాంటి స్పందన చిన్న సినిమాలకు ఆశించలేం. టాక్ చాలా బాగుంది అంటే తప్ప జనం వీటి కోసం హాళ్లకు రావడం లేదు. లక్ష్య కనక వర్కౌట్ చేసుకుంటే పుష్ప రావడానికి ముందు ఏడు రోజుల నిడివి దొరుకుతుంది. సూపర్ హిట్ టాక్ వస్తే థియేటర్లు పూర్తిగా తగ్గిపోవు కానీ రెండో వారం కూడా హోల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏం జరగబోతోందో

Also Read : RRR : 30 రోజుల RRR కౌంట్ డౌన్ షురూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి