iDreamPost

రామోజీ ఫిల్మ్ సిటీని 3 సంవత్సరాలు అద్దెకు తీసుకున్న హాట్‌స్టార్-డిస్నీ?

రామోజీ ఫిల్మ్ సిటీని 3 సంవత్సరాలు అద్దెకు తీసుకున్న  హాట్‌స్టార్-డిస్నీ?

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో భారతదేశంలో విధించిన లాక్డౌన్ తో ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమవడంతో చాలా OTT ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ వినియోగం గనణీయంగా పెరిగింది. ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వడంతో వినోదం కోసం OTT ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయించారు. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకుని హాట్‌స్టార్ డిస్నీ సంస్థ హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీని 3 సంవత్సరాలు అద్దెకు తీసుకునట్టు తెలుస్తుంది.

ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీగా పేరొందిన రామోజీ ఫిలిం సిటీని ఇప్పుడు 3 సంవత్సరాలకు హాట్‌స్టార్ డిస్నీ సంస్థ అద్దెకు తీసుకోవడంతో ఈ పరిణామం చిత్రసీమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మగధీర, బాహుబలి లాంటి అనేక హిట్ చిత్రాలను తీయడానికి వేదికగా వాడుకున్న ఫిల్మ్ సిటీలో ఇకపై ఏదైనా చిత్రం షూటంగ్ జరుపుకోవాలి అంటే కచ్చితంగా డిస్నీ వారి అనుమతి తీసుకోవలసి వస్తుందని దీనికి వారు ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదని పలువురు సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఈ నిర్ణయం చిత్ర సీమ పై తీవ్ర ప్రభావం చూపబోతోందనే మాట వినిపిస్తుంది.

డిస్నీ సంస్థ వారు 2019 సంవత్సరంలోనే “స్టార్, హాట్‌స్టార్‌”లను తమ సొంతం చేసుకున్నారు. ఈ విలీనంతో హాట్‌స్టార్ అత్యంత శక్తివంతమైన OTT ప్లాట్‌ఫామ్‌లో ఒకటిగా మారింది. ప్రజలందరూ OTT ప్లాట్‌ఫామ్‌కే ప్రస్తుతం మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ఆ ప్లాట్‌ఫామ్‌ కి దిగ్గజంగా ఉన్న హాట్‌స్టార్ డిస్నీ సంస్థ ఇకపై ఫిలిం సిటీలోనే ఆ ప్లాట్‌ఫామ్‌ కి సంబంధించిన కంటెంట్ ని ఉత్పత్తి చేయవచ్చనే అలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, రాబోయే కాలంలో అద్దెకు తీసుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ నిర్ణయం సినిమా థియేటర్లకు వ్యాపార ముప్పు గా మారబోతోంది అనే వాదన వినిపిస్తుంది.

ప్రస్తుత నేపథ్యంలో OTT ప్లాట్‌ఫామ్‌లలో వినోదాత్మకమైన కంటెంట్ పొందుతున్న ప్రజలు ఇక థియేటర్లలో సినిమాలు చూడటం గనణీయంగా తగ్గించవచ్చు అని , ఇక పై సినీ నిర్మాతలు సైతం OTT ప్లాట్‌ఫామ్‌ లో విడుదల చేయడానికి వీలుగా చిన్న చిన్న చిత్రాలకు పొడ్యుస్ చేసే అవకాశం ఉందని ఉదాహరణకి మహమ్మారి లాక్డౌన్ సమయంలో, బాలీవుడ్ పరిశ్రమ చాలా పెద్ద బ్యానర్ చిత్రాలు ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన గులాబో సీతాబో లాంటి సినిమాలు ఇప్పటికే ఈ OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాగా రాబొయే కొద్ది రోజుల్లో అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబ్, విద్యాబాలన్ యొక్క శకుంతల దేవి, మరియు జాన్వి కపూర్ యొక్క గుంజన్ సక్సేనా సినిమాలు కూడా నేరుగా OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానున్నాయు అని చెబుతున్నారు.

OTT vs థియేటర్

నిజానికి తక్కువ బడ్జెట్ చిత్రాలకు OTT ప్లాట్‌ఫామ్‌లు మంచి చాయిస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది పెద్ద-బడ్జెట్ చిత్రాల సరసన సరితూగనప్పటికీ, ప్రొడక్షన్ హౌస్‌కు ఖచ్చితంగా కంటెంటును బట్టి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడ్డ గులాబో సీతాబో హక్కులను ప్రైమ్ 60-65 కోట్ల రూపాయలకు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు 30 కోట్ల రూపాయల లాభం లభించినట్లు అయింది. అదే ఈ చిత్రం థియేటర్లలో విడుదల చేసి ఉంటే, నిర్మాతలు లాభాలను ఎగ్జిబిటర్లతో పంచుకోవలసి వచ్చేది. అయితే, పెద్ద బడ్జెట్ చిత్రం దగ్గరికి వచ్చేసరికి దీనికి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, రజనీకాంత్ నటించిన రోబో 2.0 చిత్రం 570 కోట్ల బడ్జెట్ తో 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ .800 కోట్లు సంపాదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ OTT ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇంత వెచ్చించే పరిస్థితి లేదని ఆయా వర్గాలు చెబుతున్న మాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి