iDreamPost
android-app
ios-app

OTTలోకి సూపర్ హిట్ హారర్ మూవీ.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..?

హారర్ మూవీ అంటే ఇష్టపడని వారుండరు. భయపెడుతున్నా.. భయపడుతూనే వాచ్ చేస్తుంటారుు. అలాంటి ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే..?

హారర్ మూవీ అంటే ఇష్టపడని వారుండరు. భయపెడుతున్నా.. భయపడుతూనే వాచ్ చేస్తుంటారుు. అలాంటి ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే..?

OTTలోకి సూపర్ హిట్ హారర్ మూవీ.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..?

సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూసే సినిమాలు ఏవంటే హారర్ మూవీస్. భయపడుతున్నా వాచ్ చేయాల్సిందే. ఇండియన్ హారర్ చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాలను కూడా చూసేయాల్సిందే. థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయ్యాం అనుకునే వాళ్లంతా.. ఓటీటీలోకి వచ్చేశాక మిస్ కావడం లేదు. చెమట పట్టిస్తున్నా.. దుప్పటి ముసుగు వేసుకుని మరీ సినిమాను ఎంజాయ్ చేస్తుంటారు మూవీ లవర్స్. వీకెండ్ వస్తే చాలు హారర్ జోనర్ మూవీస్ ఏమన్నా ఓటీటీలోకి వచ్చాయా అని సెర్చ్ చేస్తుంటారు. వాటి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. మీరు కూడా భయంకరమైన సినిమాలకు.. భయంకరమైన ఫ్యాన్సా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

అదే ది ఫస్ట్ ఒమెన్. హారర్ చిత్రాలకు పెట్టింది పేరైనా హాలీవుడ్ మూవీ ఇది. నన్ మూవీ తరహాలోనే ఈ మూవీ కూడా భయపెడుతుంది. ఫస్ట్ ఒమెన్ మూవీ ఒమెన్ ఫ్రాంచేజీలో ఒకటి. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచేజీ నుండి ఐదు సినిమాలు రాగా, ఇది ఆరవది. ది ఒమెన్‌(1976), డామెయిన్‌- ఒమెన్‌ 2 (1978), ద ఫైనల్‌ కాన్‌ఫ్లిక్ట్‌(1981), ఒమెన్‌ 4- ద అవేక్‌నింగ్‌(1991), ది ఒమెన్‌(2006).. ఇప్పుడు వచ్చిన ది ఫస్ట్‌ ఒమెన్‌(2024) ఆరవది. ఇది ది ఒమెన్ సినిమాకు ప్రీక్వెల్ లాంటిది. ది ఒమెన్ వచ్చిన 18 ఏళ్లకు ది ఫస్ట్ ఒమెన్ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ఏప్రిల్ 5, 2024లో థియేటర్లలో విడుదలైంది. హాలీవుడ్ మూవీస్ ప్రముఖ నిర్మాణ సంస్థ 20వ సెంచరీ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకుని విడుదల చేసింది.

గతంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. అర్కాషా స్టీవెన్సన్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ హారర్ మూవీ అమెరికాలో విడుదలైన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో నెల్ టైగర్ ఫ్రీ , తాఫీక్ బర్హోమ్ , సోనియా బ్రాగా , రాల్ఫ్ ఇనెసన్, బిల్ నైఘీ నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ హక్కులను కొనుగోలు చేసింది. మూవీ విడుదలైన నెలన్నర రోజులకు హాట్ స్టార్‌లోకి రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఓటీటీ సంస్థ. ఇంతకు ఎప్పుటి నుండి స్ట్రీమింగ్ కాబోతుంది అంటే.. మే 30 నుండి ప్రేక్షకులను భయపెట్టేసేందుకు సిద్ధమౌతుంది. మరెందుకు ఆలస్యం ఈ నెలలో సరైన సినిమాలు లేవని ఆందోళన చెందుతున్న మూవీ లవర్స్.. ఈ హారర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.

Jojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetmadridbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabet girişdeneme bonusu veren siteler 2026deneme bonusu veren siteler 2026Marsbahis GirişCasibomJojobet Girişcasibom girişDeneme Bonusu Veran Siteler 2026jojobet girişjojobetjojobet girişjojobet giriş