iDreamPost
android-app
ios-app

OTT Movie: OTTలోకి సూపర్ హిట్టైన సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌! అస్సలు మిస్ కాకండి!

  • Published Mar 19, 2024 | 12:59 PM Updated Updated Mar 19, 2024 | 12:59 PM

ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. పైగా కొన్ని సినిమాలో డైరెక్ట్ గా ఓటీటీ లోనే ఎంట్రీ ఇచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రం .. తెలుగులో కూడా స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

ఓటీటీ లో విడుదలయ్యే సినిమాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. పైగా కొన్ని సినిమాలో డైరెక్ట్ గా ఓటీటీ లోనే ఎంట్రీ ఇచ్చి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రం .. తెలుగులో కూడా స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

  • Published Mar 19, 2024 | 12:59 PMUpdated Mar 19, 2024 | 12:59 PM
OTT Movie: OTTలోకి సూపర్ హిట్టైన సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌! అస్సలు మిస్ కాకండి!

హాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ క్రమంలో హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జాక్ స్నెడర్ తెరకెక్కించిన ఓ భారీ యాక్షన్ ఫిల్మ్ “రెబల్ మూన్ : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్”. ఈ చిత్రం గత సంవత్సరం డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. కాగా, ఈ చిత్రానికి ఓటీటీ లో భారీ రెస్పాన్స్ లభించింది. పైగా, ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ.. నెట్ ఫ్లిక్స్ లో మంచి వ్యూవర్ షిప్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు “రెబల్ మూన్ : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్” చిత్రానికి సిక్వెల్ గా “రెబెల్ మూన్-పార్ట్ 2: ది స్కార్ గీవర్” ను తెరకెక్కించారు దర్శకుడు. పార్ట్ -1 లానే ఈ సినిమాను కూడా నేరుగా ఓటీటీ లోవిడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

“రెబల్ మూన్ : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్” సినిమా అంతా కూడా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా.. డైరెక్టర్ జాక్ స్నెడర్ తెరకెక్కించారు. ఈ దర్శకుడికి హాలీవుడ్ లో చాలా గొప్ప పేరు ఉంది. ఈయన డైరెక్షన్ లో ఏదైనా సినిమా వస్తుందంటేనే.. ఆ సినిమాలపై అందరికి భారీ ఎక్స్పెక్టషన్స్ ఉంటాయి. జాక్ స్నెడర్ తన సినిమాలతో.. ఓ డిఫరెంట్ టేకింగ్ తో ఓ ఫాంటసీ వరల్డ్ ను సృష్టిస్తుంటాడు. ఇలా తన సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు పార్ట్-1 లానే, “రెబెల్ మూన్-పార్ట్ 2: ది స్కార్ గీవర్” కూడా ఉండబోతుంది. ఏప్రిల్ 19న ఈ సినిమా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో.. తెలుగు, హిందీ,తమిళం,కన్నడ, మలయాళంలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్.

A super hit sci-fi action thriller on OTT

కాగా, ఈ చిత్రంలో సోఫియా బౌటెల్ల , ఎడ్ స్క్రీన్, మైఖేల్ హ్యూస్ మన్, చార్లీ హున్నామ్ , షార్లెట్ మాగీ, స్టాజ్ నాయర్, బే డూనా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. మరి, “రెబెల్ మూన్-పార్ట్ 2: ది స్కార్ గీవర్” విడుదల కావడానికి కాస్త సమయం ఉంది కాబట్టి .. ఈ సినిమా అర్ధం కావాలంటే ముందుగా “రెబల్ మూన్ : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్” చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో కూడా.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్య ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగిపోతున్న క్రమంలో.. భాషతో సంబంధం లేకుండా కథను బట్టి .. ఆయా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మరి “రెబెల్ మూన్-పార్ట్ 2: ది స్కార్ గీవర్” సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss