iDreamPost

టీమిండియా అరుదైన ఘనత.. సౌత్ ఆఫ్రికాపై విజయంతో..!

Team India Created History In Cape Town: టీమిండియా సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో టెస్టు మ్యాచ్ గెలవడమే కాకుండా.. సిరీస్ ని సమం చేసింది.

Team India Created History In Cape Town: టీమిండియా సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో టెస్టు మ్యాచ్ గెలవడమే కాకుండా.. సిరీస్ ని సమం చేసింది.

టీమిండియా అరుదైన ఘనత.. సౌత్ ఆఫ్రికాపై విజయంతో..!

టీమిండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అట్టహాసంగా ముగిసింది. మొత్తం 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల్లో ఇరు జట్లు తలపడ్డాయి. టీ20ల్లో మొదటి మ్యాచ్ రద్దవగా.. 1-1తో టీ20 సిరీస్ సమం అయ్యింది. తర్వాత జరిగిన వన్డే మ్యాచ్ సిరీస్ ని మాత్రం 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఇంక టెస్టు సిరీస్ ని కూడా 1-1 తేడాతో ఇరు జట్లు సమం చేశాయి. అయితే ఈ టెస్టు సిరీస్ మాత్రం ఆద్యంతం ఉత్కంఠగానే సాగింది. ఎందుకంటే తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. రెండో టెస్టులో మాత్రం దెబ్బకు దెబ్బ కొట్టింది. అంతేకాకుండా ఒక అరుదైన ఘనతను కూడా టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది.

టీమిండియా ఈ టూర్ లో చాలానే రికార్డులను నెలకొల్పింది. అలాగే రెండో టెస్టు గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు ప్రొటీస్ బ్యాటర్లను కేవలం 55 పరుగలకే ఆలౌట్ చేశారు. నిజానికి సౌత్ ఆఫ్రికా గడ్డపై వారిని టెస్టుల్లో అత్యల్ప స్కోరుకు పరిమితం చేయడం చాలా గొప్ప విషయమే అవుతుంది. కాకపోతే తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో మాత్రం టీమిండియా తడబడింది. సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే మంచి స్కోరే చేసినా కూడా.. మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌట్ కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. చివరికి మాత్రం కేవలం 79 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు సునాయాసంగా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయాన్ని నమోదు చేసింది.

టీమిండియా సాధించిన ఘనత ఏంటంటే.. కేప్ టౌన్ లో న్యూల్యాండ్స్ మైదానంలో సౌత్ ఆఫ్రికాపై టెస్టు మ్యాచ్ నెగ్గిన తొలి ఏషియన్ జట్టుగా భారత జట్టు చరిత్ర సృష్టించింది. అలాగే న్యూల్యాండ్స్ లో తొలి టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డుల కెక్కాడు. ఇంక బౌలర్లు సిరాజ్(7 వికెట్లు), బుమ్రా(8 వికెట్లు) కూడా అద్భుతంగా రాణించారు. ముఖేశ్ కుమార్ కూడా రెండు ఇన్నింగ్స్ లో కలిపి 4 వికెట్లు సాధించాడు. ఈ గణాంకాలు టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనకు నిదర్శనమే చెప్పాలి. అంతేకాకుండా రెండు ఇన్నింగ్స్ లో కలిపి సౌత్ ఆఫ్రికాని కేవలం 231 పరుగలకే పరిమితం చేయడం చెప్పుకోదగ్గ అంశం. న్యూల్యాండ్స్ లాంటి బౌలింగ్ పిచ్ పై బ్యాటింగ్ పరంగా కూడా భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శనే చేశారు. 55 పరుగులకే ప్రొటీస్ ఆలౌట్ అవ్వగా.. టీమిండియా మాత్రం 153 పరుగులు చేయగలిగింది.

మొత్తానికి సిరీస్ ని సమం చేసుకున్నా కూడా తొలి టెస్టుతో పోలిస్తే.. రెండో టెస్టులో మాత్రం అద్భుతంగా రాణించారు. అలాగే సౌత్ ఆఫ్రికాలో ఒక టెస్టు సిరీస్ ని డ్రా చేసుకోవడం టీమిండియాకి ఇది కేవలం రెండోసారి మాత్రమే. ఇంక మ్యాచ సమురీ చూస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 55 పరుగులే చేశారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు 176 పరుగులు చేయగా.. భారత్ 7 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈ టెస్టులో మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా జాస్ప్రిత్ బుమ్రా, డీన్ ఎల్గర్ నిలిచారు. మరి.. టీమిండియా సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి