iDreamPost

ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆ హీరోయిన్ల ఫోన్లు కూడా..

Heroines Phones Tapped: కొంతమంది టెక్నాలజీని చెడు పనులకు వాడుతున్న రోజులు ఇవి. ముఖ్యంగా ఫ్యాన్ ట్యాపింగ్ తో పర్సనల్ విషయాలు తెలుసుకొని వాటితో బెదిరింపులకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే.

Heroines Phones Tapped: కొంతమంది టెక్నాలజీని చెడు పనులకు వాడుతున్న రోజులు ఇవి. ముఖ్యంగా ఫ్యాన్ ట్యాపింగ్ తో పర్సనల్ విషయాలు తెలుసుకొని వాటితో బెదిరింపులకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆ హీరోయిన్ల ఫోన్లు కూడా..

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు పలువురి రాజకీయ నేతల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ అయ్యాయని అందరూ భావించారు.. కానీ రాజకీయ నేతలతో పాటు కొంతమంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయని.. ఆ రికార్డులను రాజకీయ నేతలకు పంపించినట్లు పెద్దు ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఆ హీరోయిన్లు ఎవరు.. వారి కాల్ రికార్డు ఎవరికి పంపించారు అన్న విషయం మాత్రం రిలీవ్ చేయలేదు. కాగా, బీఆర్ఎస్ హయాంలో చట్టవిరుద్దంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో పలు కీలక విషయాలు బయటపడుతు్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో చట్టవిరుద్దంగా పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ కేసులో ఎస్‌బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కిలక వ్యక్తిగా గుర్తించి ఆయనను అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న అధికారులు రహస్య విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణలో పలు విస్తుతపోయే నిజాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే బాధితులు అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఈ లీస్టులో పలువురి హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ రికార్డులను పలువురు రాజకీయ నేతలకు పంపించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

గత కొంత కాలంగా పలువురు హీరోయిన్ల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసి వాటిని రికార్డు చేయడం, వాట్సాప్ చాట్ హిస్టరీని చోరీ చేసి, ఆ డేటాను పెన్ డ్రైవ్, ఈ మెయిల్స్ ద్వారా కొంతమంది రాజకీయ నేతలకు పంపించినట్లుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. హీరోయిన్ల డేటాను రాజకీయ నేతలకు ఉద్దేశ్యపూర్వకంగా తమ స్వలాభం కోసం వాడుకున్నారా? లేక హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి వేరే పనులకు వాడుకున్నారా? డబ్బు గుంజారా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ బాధిత హీరోయిన్లు ఎవరు? వాళ్ల రికార్డు ఎవరికి పంపించారు అన్న విసయం చాలా సీక్రెట్ గా ఉంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రణీత్ రావు విచారణలో పలు సంచలన విషయాలు అధికారులకు చెప్పినట్లు గా వార్తలు వస్తున్నాయి. అయితే కాల్ రికార్డుకు సంబంధించిన ఎవిడెన్స్ అయిన పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్ అన్నీ నల్లమల అడవుల్లో ధ్వంసం చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి