iDreamPost
android-app
ios-app

Namitha: ఆ నిర్మాత చేతిలో మోసపోయాను… నమిత బయట పెట్టిన నిజాలు!

  • Published May 22, 2024 | 5:33 PM Updated Updated May 22, 2024 | 5:33 PM

ఆ స్టార్‌ హీరో సరసన హీరోయిన్‌ గా నటించే అవకాశం ఇస్తానంటూ అందలా ముద్దుగుమ్మ నమితను ఓ నిర్మాత దారుణంగా మోసం చేశాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఆ స్టార్‌ హీరో సరసన హీరోయిన్‌ గా నటించే అవకాశం ఇస్తానంటూ అందలా ముద్దుగుమ్మ నమితను ఓ నిర్మాత దారుణంగా మోసం చేశాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published May 22, 2024 | 5:33 PMUpdated May 22, 2024 | 5:33 PM
Namitha: ఆ నిర్మాత చేతిలో మోసపోయాను… నమిత బయట పెట్టిన  నిజాలు!

హీరోయిన్‌ నమిత.. ఈపేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సొంతం సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో తన నటనతో, అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. దీని తర్వాత వెకంటేష్‌ జెమిని మూవీలో నటించి మంచి పాపులర్‌ హీరోయిన్‌ గా మారిపోయిది. ఇలా ఈ అమ్మాడు చేసిన తక్కువ సినిమాలే కానీ, అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో మంచి క్రేజీ హీరోయిన్‌ గా మారింది. అయితే అందం,నటన రెండు కలగలిగిన ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అందిపుచ్చుకోలేదనే చెప్పవచ్చు. దీంతో హీరోయిన్‌ గా ఇండస్ట్రీలో ఈమె కనుమరుగయింది. ఇక కొంత కాలానికి ప్రభాస్‌ బిల్లా సినిమాలోను, అలాగే బాలకృష్ణ సింహా సినిమాలో అలరించింది.

అయితే నమిత తెలుగులో కన్నా.. తమిళ్‌ లోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. కాగా,తమిళనాట ఈమె విజయకాంత్‌ మా అన్న చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. దిగన్, ఇంగ్లీస్ఖరన్, చాణకియ, బంబారా కన్నాలే, కోయంబత్తూర్ బ్రదర్స్, పచ్చ ఉద్దీ, వయారి, నాన్ అవన్ అలై, అజ్జయ తమిళ్ మగన్ వంటి సినిమాల్లో నటించింది. అలా తెలుగు, తమిళంలో మంచి ఆదరణ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ నేపథ్యంలో నటి నమిత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఇంటర్వ్యూ వైరల్‌ గా మారింది.

ఇక ఆ ఇంటర్వ్యూలో నమిత మాట్లాడుతూ.. ధనుష్ సినిమాలో కాల్షీట్ అడిగి ఒక నిర్మాత మోసం చేశాడని చెప్పింది. కాగా, 2006లోని ఓ సినిమాలో నటించమని నన్ను అడిగారు. ఇక  ఆ సినిమా పేరు చెప్పనక్కర్లేదు, ఆ సినిమా నిర్మాత.. ఈ సినిమాలో ధనుష్‌ సరసన నేను నటించాలని నా దగ్గర కాల్షీట్ తీసుకున్నాడు. కానీ ఆఖరికి నిర్మాత కజిన్‌ ఆ సినిమాలో హీరోగా నటించాడు. ఆ విషయం తెలియగానే చాలా బాధపడి సగంలోనే సినిమా నుంచి బయటకు వచ్చేశా. ఆపై ఎలాగోలా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. అయితే ఈ విషయం మీద అప్పట్లో నిర్మాతల మండలికి, నటీనటుల మండలికి ఫిర్యాదు చేశాను’ అంటూ నటి నమిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మరి, నిర్మాత చేతిలో నమిత అలా మోసపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişRoyalbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbetHoliganbet GirişGrandpashabet Giriş