iDreamPost

ప్రేమలు సినిమా హీరోయిన్ మమితా బైజు కొత్త సినిమా! OTTలోకి వచ్చేసింది!

  • Published Apr 06, 2024 | 12:54 PMUpdated Apr 06, 2024 | 12:54 PM

ప్రేమలు ఫేమ్ మమితా బైజ్ కోలీవుడ్ లో లేటెస్ట్ గా నటించిన రూ. 40 కోట్ల సినిమా రెబల్. అయితే ఈ సినిమా తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా.. సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..

ప్రేమలు ఫేమ్ మమితా బైజ్ కోలీవుడ్ లో లేటెస్ట్ గా నటించిన రూ. 40 కోట్ల సినిమా రెబల్. అయితే ఈ సినిమా తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండా.. సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Apr 06, 2024 | 12:54 PMUpdated Apr 06, 2024 | 12:54 PM
ప్రేమలు సినిమా హీరోయిన్ మమితా బైజు కొత్త సినిమా! OTTలోకి వచ్చేసింది!

హరోయిన్ ‘మ‌మితా బైజు’. ప్రస్తుతం ఈ బ్యూటీ పేరు ఇండస్ట్రీలో మారు మోగుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ప్రేమలు’ సినిమాతో ఓవ‌ర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయింది మ‌మితా బైజు. ఇక ఈ సినిమా అటు మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, భాషల్లో కూడా విడుదలవ్వడంతో.. ఈ అమ్మాడు రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఈ సినిమాలో ఆమె అందం, ఆద్భుతమైన నటనతో యూత్ కలల రాణిగా మారిపోయింది. అంతేకాకుండా.. మ‌మితా బైజు సౌత్ లో మరో సాయిపల్లవి అవుతుందంటూ పలువురు సినీ ప్రముఖులు ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రేమలు సినిమా మంచి విజయం సాధించడంతో.. ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.ఈ క్రమంలోనే మమితా బైజ్ కోలీవుడ్ లోని రెబల్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయితన ప‌ది రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది. ఇంతకి ఎక్కడంటే..

ప్రేమలు ఫేమ్ మమితా బైజ్ తమిళనాట లేటెస్ట్ గా నటించిన సినిమా ‘రెబల్’. అయితే ఈ సినిమా గతనెల మార్చి 22న థియేట‌ర్ల‌లో రిలీజైంది. కాగా, పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమానకు నికేష్ ఆర్ ఎస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ సినిమా ర‌ళ‌లోని మున్నార్‌కు చెందిన ఓ స్టూడెంట్ జీవితంలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు తెరకెక్కించారు. కానీ, సినిమాలో కొత్తతనం లేకపోవడంతో రెబల్ మూవీ ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయింది. దీంతో మొదటి వారంలోనే ఈ మూవీ థియేట‌ర్ల నుంచి తొలిగించేశారు. ఇక థియేటర్లలో అంతగా మెప్పించలేని రెబల్ మూవీ రిలీజైన పది రోజుల వ్యవధిలోనే ఎలాంటి ప్రకటన లేకుండా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. కాగా, రెబల్ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియాలో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాకుండా.. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

Mamita Baiju's new movie has hit OTT!

ఇక రెబల్ సినిమాలో.. మమితా బైజు కు జోడిగా జీవీ.ప్రకాశ్‌కుమార్ నటించారు. అయితే జీవీ. ప్రకాశ్‌కుమార్‌కు కూడా సంగీత దర్శకుడిగా, ఒక నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే రెబల్ సినిమాకి ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాత వహించారు. పైగా ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్‌ అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినప్పటికి.. మిశ్రమ స్పందన తెచ్చుకొని పర్వాలేదరు అనిపించింది.

ఇక రెబెల్ సినిమా విషయానికి వస్తే.. క‌థిరేస‌న్ అనే ఓ మ‌ల‌యాళీ కుర్రాడు..తన ఉన్న‌త చ‌దువుల కోసం మున్నార్ నుంచి పాల‌క్కాడ్ వ‌స్తాడు. అయితే అక్క‌డ కొంద‌రు త‌మిళ స్టూడెంట్స్‌తో జ‌రిగిన గొడ‌వ క‌థిరేస‌న్ జీవితాన్ని ఎలాంటి మ‌లుపు తిప్పింది. కాలేజీ గొడ‌వ‌గా మొద‌లైన ఈ ఇష్యూ రాజ‌కీయ రంగ‌ను ఎలా మలపుతిరుగుతుంది? సారా మేరీ జాన్ అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డ క‌థిరేస‌న్ ఆమె ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డం కోసం ఎలాంటి పోరాటం చేశాడ‌న్న‌దే రెబెల్ మూవీ క‌థ‌. ఇక ప్రశ్నలన్నింటికి సమాధానం తేలియాలంటే.. వెంటనే అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న రెబల్ సినిమాను చూసేయాల్సిందే. మరి, మమితా బైజ్ రెబల్ మూవీ సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి