iDreamPost

రేణుక స్వామి కుటుంబానికి న్యాయం జరగాలి.. నేరస్థుడికి శిక్ష పడాలి : సుదీప్

  • Published Jun 17, 2024 | 9:19 AMUpdated Jun 17, 2024 | 9:19 AM

Sudeep About Darsan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ .. ఓ అమ్మాయి కోసం మరో వ్యక్తిని హత్య చేసిన ఘటన ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీలు స్పందించగా ఇప్పుడు మరో హీరో ఈ విషయమై స్పందించారు.

Sudeep About Darsan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ .. ఓ అమ్మాయి కోసం మరో వ్యక్తిని హత్య చేసిన ఘటన ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీలు స్పందించగా ఇప్పుడు మరో హీరో ఈ విషయమై స్పందించారు.

  • Published Jun 17, 2024 | 9:19 AMUpdated Jun 17, 2024 | 9:19 AM
రేణుక స్వామి కుటుంబానికి న్యాయం జరగాలి.. నేరస్థుడికి శిక్ష పడాలి :  సుదీప్

కన్నడ హీరో దర్శన్ రేణుక స్వామిని హత్య చేయించిన కేసుకు గురించి.. మీడియా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు .. ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. ఈ హత్య కేసు రోజుకు ఓ మలుపు తిరుగుతుంది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కొద్దీ.. ఆశ్చర్య కర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి.. విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ఈ కేసు విషయంపై స్పందిస్తూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కన్నడ హీరో సుదీప్ సైతం.. ఈ కేసు విషయంపై కొన్ని ఆసక్తి కర కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

చాలా మంది ఇప్పటికే దర్శన్ ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనీ.. డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో సైతమ్ సుదీప్ సైతం ఈ విధంగానే ప్రస్తావించారు.” ఈ కేసులో నేరస్థుడికి శిక్ష పడితే.. ఇండస్ట్రీ సంతోషిస్తుంది. అలాగే న్యాయం గెలవాలి. రేణుకస్వామి భార్యకు న్యాయం జరగాలి. ఇదంతా నాకు తెలుసు.. మీడియా ఏం చుపిస్తున్నారో మాకు తెలుసు. నిజానిజాలను బయటకు తీసుకురావడానికి మీడియా, పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో రెండో మాట లేదు నాకు తెలిసి ఈ కేసు విషయంలో సీఎం స్వయంగా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల వార్తల్లో చూసాను. నేను వారికి మద్దతుగా మాట్లాడటం చాలా తప్పు. అలాగే వ్యతిరేకంగా మాట్లాడినా తప్పే అవుతుంది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి.

రోడ్డుపై అనాథ శవంలా పడిపోయిన రేణుకస్వామి కుటుంబానికి న్యాయం జరగాలి. పుట్టబోయే బిడ్డకు న్యాయం చేయాలి. అన్నింటికీ మించి న్యాయంపై అందరికీ నమ్మకం ఉండాలి అంటే ఈ కేసులో మంచి న్యాయం జరగాలి”. అంటూ సుదీప్ చెప్పుకొచ్చారు. అలాగే.. “ప్రతి ఒక్కరి హృదయం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది.. సినీ పరిశ్రమకు న్యాయం జరగాలి. అన్ని కారణాలను చిత్ర పరిశ్రమపై నిందలు వేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి క్లీన్ చిట్ కావాలి. చాలా మంది కళాకారులు ఉన్నారు. సినిమా అనేది ఒకటి-రెండు కాదు. దోషికి శిక్ష పడితే సినీ పరిశ్రమ సంతోషిస్తుంది. ” అంటూ ఇండస్ట్రీ గురించి కూడా సుదీప్ ప్రస్తావించారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి