iDreamPost

‘మా’ రామాయణ యుద్ధంలో హేమ ఎంట్రీ

‘మా’ రామాయణ యుద్ధంలో హేమ ఎంట్రీ

గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్ మా అధ్యక్ష పదవి కోసం పోటీ పెరిగిపోతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పేర్లు ఇప్పటికే గట్టి ప్రచారంలో ఉండగా నిన్న జీవిత రాజశేఖర్ తోడయ్యారు. వీళ్ళు చాలడం లేదన్నట్టు తాజాగా హేమ కూడా రేస్ లో జాయిన్ కావడం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మరోవైపు శివాజీరాజా, సాయి కుమార్ లు సైతం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఫైనల్ గా ఎవరు మిగులుతారు ఎవరు పోరాడతారు ఎవరు గెలుస్తారనే అంచనా తదితరులు లెక్కలు వేయడం అసాధ్యంగా మారింది. ఇప్పుడీ ప్రక్రియ మీద ఏకంగా బెట్టింగులు కూడా వేసుకోవచ్చనేలా ఉంది.

రోజురోజుకు వ్యవహారం ముదురుతున్న మాట వాస్తవం. నిన్నటి నుంచి ప్రధాన టీవీ ఛానల్స్ అన్నీ దీని మీద స్పెషల్ కవరేజ్ ఇస్తున్నాయి. సామాన్య జనంలో ఇదో టాపిక్ గా మారిపోయింది. మా ప్రెసిడెంట్ అంటే అదేదో టాలీవుడ్ ప్రైమ్ మినిస్టర్ రేంజ్ లో బిల్డప్ మొదలైపోయింది. నిజానికిది పదవిగా కన్నా బాధ్యతగా ఎక్కువ బరువు ఉంటుంది. అయితే ఇప్పటిదాకా ఒకరిద్దరు తప్ప మా సంఘం చిరకాలం చెప్పుకునే స్థాయిలో ఎవరూ గొప్ప సేవలు అందించలేకపోయారు. స్వంతంగా ఆఫీస్ కోసం ఓ పెద్ద భవనం లాంటిది సెట్ చేసుకోకపోవడం అసోసియేషన్ ని నడిపించడంలో జరిగిన లోపాల వల్లే

ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు పోటీలో దిగాలనుకుంటున్న వాళ్ళు మాత్రం తమకు మద్దతు ఇచ్చే వాళ్ళతో ఫోన్ మంతనాలు వ్యక్తిగత భేటీలు గట్టిగానే చేస్తున్నారు. లాక్ డౌన్ తీసేయడంతో నేరుగా ఎవరినైనా కలుసుకునే వెసులుబాటు దొరికింది. ఇంకా ఎన్నికలకు టైం ఉన్నప్పటికీ అదేదో రేపో ఎల్లుండో జరుగుతాయన్నంత హడావిడి నెలకొంది. అందరి చూపు చిరంజీవి వైపే ఉన్నప్పటికీ ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో ఆయన కనీసం క్లూ కూడా ఇవ్వడం లేదు. నాగబాబు మాత్రం జై ప్రకాష్ రాజ్ అనేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే సెక్రటరీ, ట్రెజరర్ లాంటి ఇతర పదవులకు సైతం గట్టి పోటీనే ఉండబోతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి