iDreamPost

Heinrich Klaasen: సన్ రైజర్స్ బ్యాటర్ సిక్సర్ల సునామీ.. కేవలం 30 బంతుల్లోనే

సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో హెన్రిచ్ క్లాసెన్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. మెున్నటికి మెున్న 35 బంతుల్లో 85 రన్స్ చేసిన ఈ స్టార్ బ్యాటర్ తాజాగా మరో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.

సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో హెన్రిచ్ క్లాసెన్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. మెున్నటికి మెున్న 35 బంతుల్లో 85 రన్స్ చేసిన ఈ స్టార్ బ్యాటర్ తాజాగా మరో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.

Heinrich Klaasen: సన్ రైజర్స్ బ్యాటర్ సిక్సర్ల సునామీ.. కేవలం 30 బంతుల్లోనే

సౌతాఫ్రికా టీ20 లీగ్ తుది దశకు చేరుకుంది. సూపర్ కింగ్స్ తో జరిగిన సెమీ ఫైనల్లో ఘన విజయం సాధించి లీగ్ లో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ మ్యాచ్ లో కేవలం 30 బంతుల్లోనే 74 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ లీగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ ప్రోటీస్ వికెట్ కీపర్. తాజాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి.. టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జట్టులో స్టార్ బ్యాటర్ క్లాసెన్ మరోసారి తన బ్యాట్ కు పనిచెప్పాడు. 5వ నెంబర్ బ్యాటర్ గా బరిలోకి దిగిన అతడు సూపర్ కింగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత నెమ్మదిగా ఆడి.. ఆ తర్వాత జూలు విదిల్చాడు. 15 ఓవర్ల వరకు ఫస్ట్ గేర్ లో ఆడిన క్లాసెన్.. నెక్ట్స్ ఓవర్ నుంచి టాప్ గేర్ కు వెళ్లాడు.

మరీ ముఖ్యంగా సూపర్ కింగ్స్ బౌలర్ సామ్ కుక్ ను బెంబేలెత్తించాడు. అతడు వేసిన 18వ ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సు లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 30 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 7 సిక్సులతో ఏకంగా 74 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టోర్నీలో సెకండ్ లీడింగ్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు క్లాసెన్ ఆడిన 12 మ్యాచ్ ల్లో 208.87 స్ట్రైక్ రేట్ తో 447 పరుగులు సాధించాడు. ప్రస్తుతం క్లాసెన్ సూపర్ ఫామ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఫుల్ హ్యాపిగా ఉంది. అయితే ఫైనల్లో సన్ రైజర్స్ జట్టుతోనే డర్బన్ సూపర్ జెయింట్స్ తలపడాల్సి ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డర్బన్ సూపర్ జెయింట్స్ విధించిన 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 142 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో మెుయిన్ అలీ ఒక్కడే 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జూనియర్ దాలా 4 వికెట్లతో సత్తాచాటాడు. మరి సౌతాఫ్రికా టీ20 లీగ్ లో చెలరేగుతున్న క్లాసెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Chris Gayle: తెలంగాణ టీమ్ కు కెప్టెన్ గా గేల్! మరోసారి విధ్వంసానికి రెడీ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి