iDreamPost

కుండపోత వాన.. కూలిన గుడి, 16 మంది మృతి!

కుండపోత వాన.. కూలిన గుడి, 16 మంది మృతి!

గత కొన్నిరోజుల కిందట తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఎన్నో ఊర్లు వరద నీటితో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ వరదల దాటికి ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా సంభవించింది. అయితే ఈ విషాద ఘటన మరువకముందే నుంచి హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరదలు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. దీంతో కొన్ని గ్రామాలు చిగురుటాకులు వణికిపోతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మీడియా కథనాల ప్రకారం ఇప్పటికీ వరదల దాటికి 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. సిమ్లాలోని శివమందిర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లుగా సమాచారం. దీంతో పాటు సోలాన్ జిల్లాలోని మామిసిమ్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలు ఏడుగురు మరణించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇదే కాకుండా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే 257 మంది చనిపోగా, రూ.7020 కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమచారం.

హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి ఇలా ఉంటే.. ఉత్తరాఖండ్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవ్వడంతో పాటు కొన్ని భవనాలు సైతం కూలిపోతున్నాయి. దీంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది.

ఇది కూడా చదవండి: వీడియో: బాలికపై ఆవు దాడి.. కొమ్ములతో కుమ్ముతూ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి