iDreamPost

‘అతడో గ్రహాంతర వాసి’.. భారత ప్లేయర్ పై పాక్ దిగ్గజ బౌలర్ సంచలన కామెంట్స్..!

‘అతడో గ్రహాంతర వాసి’.. భారత ప్లేయర్ పై పాక్ దిగ్గజ బౌలర్ సంచలన కామెంట్స్..!

సౌతాఫ్రికాపై మినహా మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించి గ్రూప్ విన్నర్ హోదాలో సెమీఫైనల్స్ కు చేరింది. భారత్ ను సెమీస్ చేర్చడంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పాత్ర చాలా ఉంది.

టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) సెమీఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. గతేడాది సూపర్ 12 దశ నుంచే ఇంటి దారి పట్టిన భారత్ ఈసారి మాత్రం రెచ్చిపోయింది.

 టి20 ప్రపంచకప్ (T20 World Cup) 2022లో టీమిండియా (Team India) సెమీఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. గతేడాది సూపర్ 12 దశ నుంచే ఇంటి దారి పట్టిన భారత్ ఈసారి మాత్రం రెచ్చిపోయింది. (PC : TWITTER)

సౌతాఫ్రికాపై మినహా మిగిలిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించి గ్రూప్ విన్నర్ హోదాలో సెమీఫైనల్స్ కు చేరింది. భారత్ ను సెమీస్ చేర్చడంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ పాత్ర చాలా ఉంది.

ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో అయితే సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 4సిక్సర్లు ఉండటం విశేషం.

ఇక ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన షాట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఫాస్ట్ బౌలర్లు వేసే యార్కర్లను స్వీప్ షాట్లతో సిక్సర్లుగా మరల్చడం అతడికే సాధ్యమైంది.

 ఇక ఆఫ్ స్టంప్ కు దూరంగా వేసిన బంతులను స్క్వేర్ లెగ్.. ఫైన్ లెగ్.. దిశలో బౌండరీలు రాబట్టిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తనవి తీరదు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పేసర్ వసీం అక్రం ప్రశంసల వర్షం కురిపించాడు. (PC : TWITTER)

ఇక ఆఫ్ స్టంప్ కు దూరంగా వేసిన బంతులను స్క్వేర్ లెగ్.. ఫైన్ లెగ్.. దిశలో బౌండరీలు రాబట్టిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తనవి తీరదు. తాజాగా సూర్యకుమార్ యాదవ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, పేసర్ వసీం అక్రం ప్రశంసల వర్షం కురిపించాడు.

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు తాను ఫిదా అయ్యానని చెప్పిన అక్రం.. అతడి షాట్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. భూమిపై పుట్టిన మానవులకు ఇలాంటి షాట్లు ఆడటం చేతకాదని.. సూర్యకుమార్ యాదవ్ వేరే గ్రహం నుంచి వచ్చాడని కామెంట్స్ చేశాడు.

 సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు తాను ఫిదా అయ్యానని చెప్పిన అక్రం.. అతడి షాట్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. భూమిపై పుట్టిన మానవులకు ఇలాంటి షాట్లు ఆడటం చేతకాదని.. సూర్యకుమార్ యాదవ్ వేరే గ్రహం నుంచి వచ్చాడని కామెంట్స్ చేశాడు. (PC : TWITTER)

‘సూర్యకుమార్ యాదవ్ వేరే లోకం నుంచి వచ్చినట్లు ఉన్నాడు. అందుకే మానవమాత్రులు ఆడలేని షాట్లను ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు’అంటూ ప్రశంసించాడు.

 ‘సూర్యకుమార్ యాదవ్ వేరే లోకం నుంచి వచ్చినట్లు ఉన్నాడు. అందుకే మానవమాత్రులు ఆడలేని షాట్లను ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు’అంటూ ప్రశంసించాడు. (PC : TWITTER)

ఇక సూర్యకుమార్ యాదవ్ ఈ టి20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 5 మ్యాచ్ ల్లో 225 పరుగులు చేశాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో 246 పరుగులతో కోహ్లీ ముందున్నాడు. నెదర్లాండ్స్ ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్ 8 మ్యాచ్ ల్లో 242 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి