iDreamPost

కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఇకపై ఎక్కువ చెల్లించాల్సిందే!

కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఇకపై ఎక్కువ చెల్లించాల్సిందే!

ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు ఝలక్ ఇచ్చింది. బెంచ్ మార్క్ లెండింగ్ రేట్లను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమీక్షలో వడ్డీరేట్లను యథాతధంగా ఉంచినప్పటికి హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం వడ్డీ రేట్లను పెంచేసింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్ఆర్) గరిష్టంగా 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది.

కాగా హెచ్‌డీఎఫ్‌సీ సవరించిన వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్‌మార్క్ పీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి. ఎంసీఎల్‌ఆర్ పెరిగితే.. ఆయా లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగినట్లే. ఎక్కువగా పర్సనల్ లోన్లు, కార్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు వంటి వాటిపై ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.

ఓవర్ నైట్ రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్లు 8.50 శాతం నుండి 8.60 శాతానికి పెరిగింది. నెల వ్యవధి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ 10 బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.55 శాతం నుండి 8.65 శాతానికి చేరింది మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.85 శాతంగా ఉంటుంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 9.05 శాతం నుంచి 9.10కి పెంచింది. ఇక ఏడాది కాల వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.20 శాతంగానూ, రెండేళ్ల కాలానికి గాను 9.20గాన ఉంటుంది. అదే మూడేళ్ల వ్యవధి రుణాలపై వర్తించే ఎంసీఎల్‌ఆర్‌ 9.25 శాతంగా ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి