iDreamPost

గుడ్ న్యూస్.. మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయంపై హరీశ్ రావు కీలక ప్రకటన

గుడ్ న్యూస్.. మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయంపై హరీశ్ రావు కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అందిరికీ తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఉచిత కరెంట్, బీసీలకు లక్ష ఆర్థికసాయం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాల జాబితాలోకి మరో పథకం చేరబోతోంద. అందుకు సంబంధించిన విషయాలను మంత్రి హరీశ్ రావు స్వయంగా ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయని స్పష్టం చేశారు. అసలు స్కీమ్ ఏంటి? దాని వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణలో ఇటీవల బీసీల కోసం ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన వారికి చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం కింద దాదాపుగా 50 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్ని దర్ఖాస్తులు వచ్చినా.. అర్హులైన అందరికీ ఈ పథకం వర్తింపజేస్తామంటూ తెలిపారు. ఇప్పుడు అలాంటి పథకమే మైనార్టీల కోసం తీసుకురానున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. హైదరాబాద్ లో మైనార్టీ ఛైర్మన్ల అభినందన సభలో పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు- మూడు రోజుల్లోనే ఈ పథకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వస్తాయని హామీ ఇచ్చారు. బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం ప్రకటించిన సమయంలో మైనార్టీలకు కూడా ఇలాంటి పథకం కావాలంటూ ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఆ డిమాండ్లను పరిశీలించిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బీసీలకైతే ప్రతి నెల 15వ తారీఖున అర్హులైన వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. మరి మైనారిటీల పథకానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎవరిని అర్హులుగా భావిస్తారు అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు హరీశ్ రావు వ్యాఖ్యలపై ముస్లిం, మైనార్టీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిగణలోకి తమకు కూడా ఇలాంటి పథకం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దళితుల కోసం దళిత బంధు కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి విడత నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు రెండో విడత కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ, మైనార్టీల నుంచి తమకు కూడా అలాంటి ఒక పథకం కావాలంటూ డిమాండ్లు వచ్చాయి. అలాంటి స్పందన నేపథ్యంలోనే ఇప్పుడు బీసీలకు, మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి