iDreamPost

Harish Rao: సిద్ధిపేటలో మరోసారి దుమ్మురేపుతున్న హరీశ్ రావు! భారీ మెజార్టీ!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటిగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు రౌండ్లు ముగిశాయి. గెలుపుపై ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమాతో ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి హరీష్ రావు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటిగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు రౌండ్లు ముగిశాయి. గెలుపుపై ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమాతో ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి హరీష్ రావు..

Harish Rao: సిద్ధిపేటలో మరోసారి దుమ్మురేపుతున్న హరీశ్ రావు! భారీ మెజార్టీ!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. తుది ఫలితాలు వెలువడేందుకు కొంత సమయం పడుతుంది. అయితే గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, తామే గద్దెనెక్కుతామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్. ఈ సారి ప్రజలు తమకే పట్టం కట్టనున్నారని కాన్ఫిడెంట్‌తో ఉంది జాతీయ పార్టీ కాంగ్రెస్. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికి వరకు పలు రౌండ్లు ముగిశాయి. ఎమ్మెల్యే ఆశావాహులు.. ఎవరికి వారే తమ గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. ఇలా ఉంటే సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న టి. హరీష్ రావు ముందంజలో ఉన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి, బీఆర్ఎస్ నేత టి. హరీష్ రావు మరోసారి దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన రౌండ్లలో  భారీ మెజార్టీతో ముందజంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 28 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్న వేళ కూడా.. హరీష్ రావు లీడ్ లో ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన హరీష్ రావు.. 2004 నుండి తొలిసారిగా జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుండి గెలుపొంది.. ఎమ్మెల్యే అయ్యారు. ఆ నాడు 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అక్కడ నుండి విజయ దుంధుబి మోగిస్తూనే ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో 58 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిని మట్టికరిపించారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుండి పోటీ చేసి 64 వేల ఓట్లతో గెలుపొందారు. 2010లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95వేల ఓట్ల మెజార్డితో గెలుపొంది.. ఉమ్మడి ఆంధ్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాధించిన 68, 681 ఓట్ల మెజార్టీ రికార్డును తిరగరాశారు హరీష్ రావ్. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. అదే సిద్ది పేట నియోజక వర్గం నుండి 93,328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది.. కేటీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. 2018లో ముందస్తు ఎన్నికలు వెళ్లినప్పుడు కూడా మెజార్టీ విజయం సాధించారు. ప్రస్తుతం ఆర్థిక,ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2004 నుండి ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రతిసారి విజయ కేతనం ఎగరేస్తున్నారు.  ఒక్కసారి కూడా ఆయన ఓడిపోలేదు.

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి