iDreamPost

HanuMan Records: టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొడుతున్న హనుమాన్

చిన్న సినిమా ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ చిత్రం టాలీవుడ్ లో ఉన్న రికార్డులను బద్దలు కొడుతోంది. బడా బడా హీరోల చిత్రాలను వెనక్కి నెట్టేస్తోంది.

చిన్న సినిమా ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ చిత్రం టాలీవుడ్ లో ఉన్న రికార్డులను బద్దలు కొడుతోంది. బడా బడా హీరోల చిత్రాలను వెనక్కి నెట్టేస్తోంది.

HanuMan Records: టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొడుతున్న హనుమాన్

టాలీవుడ్ లో హనుమాన్ సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. రికార్డులు బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది. నిజానికి ఈ రేంజ్ రీసౌండ్ ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. కానీ, బయ్యర్లకు హనుమాన్ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న నాన్ బాహుబలి రికార్డులను తుడిచి పెట్టేస్తోంది. అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే హనుమాన్ లాభాల రికార్డులను కొట్టడం మరో సినిమాకి చాలా కష్టంగా మారుతుందనే చెప్పాలి. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో వచ్చిన తొలి చిత్రానికే ఈ స్థాయి రెస్పాన్స్ ని ఎవరూ ఊహించి ఉండరు.

సినిమా చిన్నదా పెద్దదా అని డిసైడ్ చేసే ముందు ఆ మూవీ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పేరు చిన్న సినిమా ముద్ర వేసుకున్న హనుమాన్ మాత్రం రికార్డుల్లో ఆకాశాన్ని తాకుతోంది. ముఖ్యంగా లాభాల పరంగా కాసుల వర్షం కురిపించడమే కాకుండా.. టాలీవుడ్ లో ఉన్న నాన్ బహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా హనుమాన్ రికార్డులకెక్కింది. ఈ చిత్రం 11 రోజుల్లో రూ.112 కోట్ల గ్రాస్, రూ.209 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇప్పటివరకు అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా అల వైకుంఠపురం సినిమా పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.

అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాకి మొత్తం రూ.75 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ హనుమాన్ చిత్రం కేవలం 11 రోజుల్లోనే బయ్యర్లకు రూ.82 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. టాలీవుడ్ లో లాభాల పరంగా ఉన్న రికార్డులను చూస్తే.. అల వైకుంఠపురానికి ముందు ఆ రికార్డు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరిట ఉండేది. విజయ్ నటించిన గీతా గోవిందం సినిమాకి మొత్తం రూ.55 కోట్లు లాభాలు వచ్చాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకి కూడా లాభాలు దండిగానే వచ్చాయి. కానీ, ఆ మూవీని ఆ రోజుల్లోనే ఎక్కువ మొత్తానికి అమ్మడంతో కలెక్షన్స్ లో రూ.47 కోట్లు లాభాలు దక్కాయి. ఇప్పుడు ఈ రికార్డులు అన్నింటినీ ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం తుడిచిపెట్టేసింది. 11 రోజుల్లో 82 కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. లాంగ్ రన్ లో ఈ రికార్డులు రూ.100 కోట్లు, రూ.120 కోట్లు దాటిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా హనుమాన్ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. విదేశాల్లో కూడా ఈ సినిమా బడా బడా హిరోల కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొడుతోంది. మొత్తానికి చిన్న సినిమా ముద్రతో వచ్చిన హనుమాన్ మాత్రం రికార్డుల్లో ఎన్నో పెద్ద సినిమాలకు చుక్కలు చూపిస్తోందనే చెప్పాలి. హనుమాన్ రికార్డుల నేపథ్యంలో జై హనుమాన్ పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పైగా జై హనుమాన్ గురించి ప్రశాంత్ వర్మ ఇప్పటి నుంచే హైప్ ని క్రియేట్ చేస్తున్నాడు. హనుమాన్ గా స్టార్ హీరోని తీసుకోబోతున్నట్లు కామెంట్స్ చేయడం చూశాం. అయితే జై హనుమాన్ కంటే ముందు మరో రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పాడు. 2025లో జై హనుమాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు ఛాన్స్ ఉంది. మరి.. కలెక్షన్స్ పరంగా హనుమాన్ క్రియేట్ చేస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి