iDreamPost

Prashanth Varma: HanuMan డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అస్వస్థత..

పురాణ, ఇతి హాసాల్లోని ఓ సూపర్ హీరో పవర్స్.. ఓ సాాాామాన్యుడికి ఇచ్చి.. ఇప్పటి నెటివిటీకి తగ్గట్లు తెరకెక్కిించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకెళుతుంది. కానీ ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు దర్శకుడు ప్రశాంత్..

పురాణ, ఇతి హాసాల్లోని ఓ సూపర్ హీరో పవర్స్.. ఓ సాాాామాన్యుడికి ఇచ్చి.. ఇప్పటి నెటివిటీకి తగ్గట్లు తెరకెక్కిించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకెళుతుంది. కానీ ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు దర్శకుడు ప్రశాంత్..

Prashanth Varma:  HanuMan డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అస్వస్థత..

బ్లాక్ బస్టర్ హిట్‌తో సంక్రాంతి సంబరాలను మోసుకొచ్చిన మూవీ హనుమాన్. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజై.. థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సజ్జా తేజ యాక్షన్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వెరసి.. సినిమాకు హిట్ టాక్ అందించాయి. ఈ పండుగకు అసలు సిసలైన చిత్రంగా చెప్పుకుంటున్నారు వీక్షకులు. ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ ఓ రకంగా తపస్సు చేశాడనే చెప్పాలి. ఎప్పుడో చిత్రీకరణ స్టార్ చేసుకున్న ఈ మూవీ..షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ రిలీజ్ విషయంలో పలు సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు సంక్రాంతి బరిలోకి దిగింది. ఓ సూపర్ హీరో హనుమంతుడి శక్తులు.. ఓ నార్మల్ వ్యక్తికి వస్తే ఎలా ఉంటాయో స్క్రీన్ పై చూపించడంలో సఫలీకృతుడయ్యాడు ఈ మూవీ కెప్టెన్ ప్రశాంత్ వర్మ.

ప్రశాంత్ వర్మ టేకింగ్ అండ్ వర్కింగ్ స్టైల్‌కు ఫిదా అయిపోయారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. ఆయనకు కంగ్రాట్స్ చెబుతూనే.. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఈ మూవీని ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేడు హనుమాన్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ అస్వస్థతకు గురయ్యాడు. గత మూడు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో కాల్స్ కానీ మేసేజ్‌లకు కూడా రిప్లై ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు ఆయన స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ‘ గత 3 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా. కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నా, మేసేజ్‌లకు రిప్లై ఇవ్వలేకపోతున్నా. కోలుకున్నాక.. ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాను ’ అంటూ ట్వీట్ చేశారు.

హనుమాన్ మూవీ భారీ స్పందన వస్తుంది. కేవలం లీవుడ్‌లోనే కాదూ బాలీవుడ్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. అలాగే విదేశాల్లోనూ ఈ చిత్రం సత్తా చాటుతుంది. చిన్న సినిమా వచ్చిన ఈ పిక్చర్.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురుస్తుంది. సజ్జా తేజ, అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 21 కోట్లను కొల్లగొట్టిందీ చిత్రం. ఇక థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ పని తీరును సెలబ్రిటీలే కాదూ ..ప్రేక్షకులు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కానీ వాటిని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేడు ప్రశాంత్. అయితే అతడు త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి