iDreamPost

ఈ ఫొటోలో ఉన్నది ఇండస్ట్రీని ఏలిన స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

సినిమా తారల్లో.. ధ్రువ తారలు కొన్నే ఉంటాయి. అవి కాలానికి అతీతంగా వెలుగుతూ ఉంటాయి. అలాంటి ధ్రువ తారల్లో పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ కూడా ఒకరు..

సినిమా తారల్లో.. ధ్రువ తారలు కొన్నే ఉంటాయి. అవి కాలానికి అతీతంగా వెలుగుతూ ఉంటాయి. అలాంటి ధ్రువ తారల్లో పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ కూడా ఒకరు..

ఈ ఫొటోలో ఉన్నది ఇండస్ట్రీని ఏలిన స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ, కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు. వాళ్లు సినిమాలు చేసినా.. చేయకపోయినా.. ఈ లోకంలో ఉన్నా.. లేకపోయినా.. వారి యాక్టింగ్‌ లెగసీ అలానే ఉండిపోతుంది. సినిమా చరిత్రలో వారికంటూ ఓ పేజీ ఉంటుంది. అలాంటి వారు అత్యంత అరుదుగా పుడుతూ ఉంటారు. నటనకే నడకలు నేర్పుతూ ఉంటారు. కేవలం నటన ద్వారే కాదు.. మంచి తనంతో కూడా జనాల మనసుల్ని కొల్లగొడుతుంటారు.

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌ కూడా నటన, మంచితనంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేయటమే కాదు.. తెలుగు జాతి ఖ్యాతిని దేశ వ్యాప్తం చేశారు. స్టార్‌ హీరోలను మించిన స్టార్‌డమ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. ఈ హీరోయిన్‌ డేట్ల కోసం స్టార్‌ హీరోలు సైతం క్యూలో ఉండేవారు. డేట్లు దొరక్కపోతే సినిమాను వాయిదా వేసుకునేవారు. తెలుగు, తమిళంలో అయితే ఆమె క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆమెను తమిళంలో ‘కళైమా మణి’ అని తెలుగులో ‘ మహానటి’ అని పిలిచేవారు. ఇప్పటికే మీకు ఆమె ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది. ఆ నట దిగ్గజం.. వెండి తెర సామ్రాజ్ఞి ఎవరో కాదు.. మహానటి సావిత్రి. సినిమాల్లోకి రాక ముందు దిగిన ఫొటో అది. సినిమాల్లో చేయకముందు ఆమె నాటకాలు వేసేవారు. నాట్య ప్రదర్శనలు ఇచ్చే వారు. మొదటగా ఓ పాటలో డ్యాన్స్‌ ద్వారానే ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పాతాళ భైరవి సినిమాలో పాటకు డ్యాన్స్‌ వేశారు.

తర్వాత 1952లో వచ్చిన పెళ్లి చేసి చూడు సినిమాతో నటిగా మారారు. ఇక, ఆ తర్వాతి నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. తన కెరీర్‌లో కొన్ని వందల సినిమాలు చేశారు. జెమినీ గణేషన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితంలో ఇబ్బందుల కారణంగా మందు అలవాటు చేసుకున్నారు. తర్వాత కాలంలో ఎంత ఆస్తి ఉన్నా.. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. తాగుడుకు బానిసై ఎన్నో కష్టాలు అనుభవించారు. చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా ఆమె చనిపోయారు. ఆమె చనిపోయి దాదాపు 40 ఏళ్లు అవుతున్నా.. ఆమెను ప్రేక్షకులు మర్చిపోలేదు. మహానటిగానే తమ మదిలో పెట్టుకుని పూజిస్తున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన సావిత్రి బయోపిక్‌ సాధించిన ఘన విజయమే ఆమె క్రేజ్‌ ఏంటో చెబుతుంది. మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్‌కు జాతీయ అవార్డు సైతం వచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి