iDreamPost

ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండియాని ఊపేస్తున్న స్టార్ హీరో!

నటనను వారసత్వంగా తీసుకున్న వారసులంతా.. హీరోలుగా మెప్పిస్తారని చెప్పలేం. లెగసీ కేవలం ఇంట్లో నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. కానీ ఆ తర్వాత .. వారు తమను తాము ఫ్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

నటనను వారసత్వంగా తీసుకున్న వారసులంతా.. హీరోలుగా మెప్పిస్తారని చెప్పలేం. లెగసీ కేవలం ఇంట్లో నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది. కానీ ఆ తర్వాత .. వారు తమను తాము ఫ్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండియాని ఊపేస్తున్న స్టార్ హీరో!

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు వారసులదే హవా. తాతల నుండి తండ్రులు, వారి నుండి నటనను వారసత్వంగా తీసుకుని రాణిస్తున్నారు హీరోస్. అదే సమయంలో ఈ లెగసీ పెద్ద తలనొప్పిగా మారింది. నెపో కిడ్స్ అంటూ ముద్ర వేస్తున్నారు. అలాగే వారితో వీరిని పోలుస్తూ.. ఎక్కువ ఎక్స్ ఫర్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు. దీనితో కాస్త ఒత్తిడికి గురౌతున్నారు ఫ్యూచర్ అంట్ ప్రజెంట్ స్టార్స్. కొంత మంది నిలదొక్కుకుంటే.. మరికొంత మంది చతికిల పడుతున్నారు. వాళ్ల నాన్న, తాతలా చేయలేదని, అతడి నటన, ముఖ వర్చస్సు ఇతడికి రాలేదంటూ పక్కన పెట్టేసిన హీరోలున్నారు. అలాంటి నెగిటివిటీ వాతావరణంలో తమను తాము ఫ్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు ఈ స్టార్ కిడ్స్. అటువంటి వారిలో ఈ పిక్ లో కనిపిస్తున్న పిల్లాడు కూడా.

’చబ్బీ చీక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్, టీత్ విత్ ఇన్‘ అనే చిన్న పిల్లల పాటకు ఫర్ ఫెక్ట్ సింక్ అయ్యాడు కదా ఈ ఫోటోలోని పిల్లోడు. చూస్తుంటేనే బుగ్గలు పిండేయాలనిపిస్తున్న ఈ బుడ్డోడు.. ఎవరో గుర్తుపట్టగలరా..? సరిగ్గా చూడండి.. క్యూట్ లుక్స్ తో, చబ్బీ, చబ్బీగా కనిపిస్తున్న ఈ నటుడు పాన్ ఇండియా మూవీతో రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకు అతడు ఎవరో కాదూ.. ఒకప్పటి స్టార్ హీరో కుమారుడు, మనవడు చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్. తండ్రి రిషి కపూర్, తాత రాజ్ కపూర్ నుండి నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సావరియాతో మొదలైన అతడి సినీ ప్రయాణం.. ప్రస్తుతం యానిమల్ మూవీ వరకు వచ్చింది. ఇప్పటి వరకు బాలీవుడ్ షేక్ చేసిన ఈ వీరుడు.. ఇప్పుడు పాన్ ఇండియాపై కన్నేశాడు.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యానిమల్‌లో ఈ లవర్ బాయ్.. వయలెంట్‌గా కనిపించబోతున్నాడన్న సంగతి విదితమే. ఇలాంటి పాత్రలో రణబీర్ కనిపించలేదని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ఈ పిక్చర్ పై అంచనాలు పెంచేసింది. అడ్వాన్సు బుకింగ్స్ ఆల్ మోస్ట్ సెట్. ఇందులో మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీ డియోల్ నెగిటివ్ షేడ్‌లో కనిపిస్తుండగా.. రణబీర్ తండ్రిగా సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించిన సంగతి విదితమే. డిసెంబర్ 1న థియేటర్లను రప్పాడించేందుకు సిద్ధమౌతుంది. ఈ సినిమాపై బిగ్ టార్గెట్ పెట్టుకుంది చిత్ర యూనిట్. మరీ అంచనాలు ఎంత వరకు రీచ్ అవుతాయో వేచి చూడాలి. మరీ ఈ సినిమాపై అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి