iDreamPost

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్.. కోహ్లీ- రోహిత్ వల్లే కాలేదు!

Sai Sudharsan Breaks Sachin Tendulkar Record: ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

Sai Sudharsan Breaks Sachin Tendulkar Record: ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.

సచిన్ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్.. కోహ్లీ- రోహిత్ వల్లే కాలేదు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ టైటాన్స్ టేబుల్ ఆఖరి స్థానంలో ఉంది. కానీ, ఇంకా వారికి ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. చెన్నెతో కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు చెలరేగింది. ముఖ్యంగా ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ ద్వయం చెన్నై బౌలర్లకు పీడకలను మిగిల్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు. మొదటి ఓవర్ నుంచి ఒకటే అటాకింగ్ తో చెలరేగారు. ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే స్కోర్ బోర్డు కచ్చితంగా 250 దాటించాలని వాళ్లు ఫిక్స్ అయినట్లు కనిపించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ రెట్టించి ఉత్సాహంతో ఆడాడు.

గుజరాత్ టైటాన్స్ ఆట చూస్తే క్రికెట్ దిగ్గజాలు కూడా బిత్తర పోతున్నారు. వచ్చింది మొదలు వాళ్లు బౌండరీల మీద బౌండరీలు బాదేశారు. సాయి సుదర్శన్- శుభ్ మన్ గిల్ ఇద్దరిలో ఎవరు ముందు శతకం నమోదు చేస్తారో అనే పందెం పెట్టుకుని ఆడుతున్నట్లు కనిపించింది. వీళ్ల వికెట్ తీయడం దేవుడెరుగు.. ఆ బౌండరీలు పోకుండా ఆపితే చాలు అన్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ముఖాలు పెట్టుకున్నారు. ఏ బౌలర్ ని కూడా వదలకుండా సాయి సుదర్శన్- గిల్ ఇద్దరూ పనిష్మెంట్ ఇచ్చారు. వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా వీళ్ల ముందు గల్లీ ప్లేయర్స్ లాగానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు.

చెన్నైతో జరిగన మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఆట తీరును అంతా మెచ్చుకుని తీరాల్సిందే. జట్టుకు ఏదైతో కావాలో అతను అదే ఇచ్చాడు. ఈ క్రమంలో లిటిల్ మాస్టర్ రికార్డును కూడా బద్దలు కొట్టేశాడు. ఆ రికార్డు ఏంటంటే.. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ ఐపీఎల్ లో 1000 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు సాయి సుదర్శన్ కు కేవలం 25 ఇన్నింగ్స్ మాత్రమే పట్టింది. సచిన్ టెండుల్కర్ ఐపీఎల్ లో వెయ్యి పరుగుల మార్క్ చేరుకునేందుకు 31 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో సాయి సుదర్శన్ పేరు మారుమోగుతోంది.

ఈ ఫీట్ సాధించడం రన్ మెషన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వల్ల కూడా కాలేదు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కి కూడా వెయ్యి పరుగులు చేరుకునేందుకు 31 ఇన్నింగ్స్ పట్టింది. అంటే సాయి సుదర్శన్ ఈ మ్యాచ్ లో సచిన్ టెండుల్కర్, గైక్వాడ్ రికార్డును బద్దలు కొట్టాడు. అతని ఆట చూసి.. చెన్నై అభిమానులకు కళ్లల్లో నీళ్లు వచ్చేశాయు. గిల్- సుదర్శన్ ఒక్కో బౌండరీ కొడుతుంటే వాళ్లంతా ఏడ్చినంత పని చేస్తున్నారు. సాయి సుదర్శన్- శుభ్ మన్ గిల్ కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డును కూడా బద్దలు కొట్టారు. అత్యధిక పార్టనర్ షిప్ హైదరాబాద్ పేరిట ఉండదా.. దానిని ఈ మ్యాచ్ లో బద్దలు కొట్టేశారు. సచిన్ టెండుల్కర్ రికార్డును సాయి సుదర్శన్ బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి