iDreamPost

ప్రభుత్వం కీలక నిర్ణయం!.. ఇకపై ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై!

విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు, స్టడీ మెటీరియల్స్ అన్నీ ఆన్ లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు, స్టడీ మెటీరియల్స్ అన్నీ ఆన్ లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం కీలక నిర్ణయం!.. ఇకపై ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై!

ఇప్పుడంతా డిజిటల్ యుగం. ఏ పని కావాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరి అయిపోయింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత పెను మార్పులు సంభవించాయి. అన్ని పనులు ఆన్ లైన్ వేదికగానే జరుగుతున్నాయి. పలు కంపెనీలు వర్చ్యువల్ మీటింగ్ ల ద్వారా కంపెనీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు, స్టడీ మెటీరియల్స్ అన్నీ ఆన్ లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై అందించేందుకు నిర్ణయించింది. దీంతో విద్యార్థులకు మరింత ఉపయోగం కలుగనున్నది.

నేటి కాలంలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒడిషా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ వేళ విద్యార్థులకు శుభవార్తను తెలిపింది. ఇక నుంచి ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కలుగజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రమాకాంత నాయక్ .. ప్రభుత్వ పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ లకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ప్రభుత్వ యూనివర్శిటీల్లోని విద్యార్థులకు అవసరమైన ఆన్ లైన్ స్టడీ మెటీరియల్స్, ఇతర ఈ-బుక్స్ డౌన్ లోడ్ చేసుకొనేందుకు యూనివర్శిటీ క్యాంపస్ లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించనుంది ఒడిషా ప్రభుత్వం. దీనికి సంబంధించి అన్నీ అంశాలతో కూడిన అంచనా వ్యయాన్ని తెలపాలని యూనివర్శిటీ రిజిస్ట్రార్ లను విద్యాశాఖ కోరింది. యూనివర్శిటీలకు ఫ్రీ వైఫై ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు భారీ ప్రయోజనం చేకూరనున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి