iDreamPost

Google: కస్టమర్లకు 5800 కోట్లు చెల్లించనున్న గూగుల్! కారణం ఏంటంటే?

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు సుమారు రూ. 5800 కోట్ల పరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. మరి ఇంత భారీ మెుత్తంలో డబ్బులు చెల్లించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు సుమారు రూ. 5800 కోట్ల పరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. మరి ఇంత భారీ మెుత్తంలో డబ్బులు చెల్లించడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Google: కస్టమర్లకు 5800 కోట్లు చెల్లించనున్న గూగుల్! కారణం ఏంటంటే?

ప్రముఖ కంపెనీలు కొన్ని కొన్ని సందర్భాల్లో తమ కస్టమర్లకు భారీ మెుత్తంలో డబ్బులను చెల్లిస్తూ ఉంటాయి. గతంలో ప్రముఖ బడా కంపెనీలు తమ వినియోగదారులకు వేల కోట్లలో డబ్బులు ఇచ్చిన వార్తలు మనం చదివేఉన్నాం. తాజాగా గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు దాదాపు 700 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 5800 కోట్లు) పరిహారాన్ని చెల్లించనుంది. మరి ఇంత భారీ మెుత్తంలో గూగుల్ పరిహారాన్ని చెల్లించడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు సుమారు రూ. 5800 కోట్ల పరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించింది. అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు, అటార్నీ జనరల్ దాఖలు చేసిన యాంటీ ట్రస్ట్ గూగుల్ పై ఫిర్యాదు చేసింది. దీంతో పాటుగా ప్లే స్టోర్ లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. అసలు విషయం ఏంటంటే? ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ మార్కెట్ పై గూగుల్ కొన్ని విషయాల్లో అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని అమెరికా వినియోగదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రూల్స్ విరుద్దంగా ఆండ్రాయిడ్ ధరలను పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ ఆరోపించారు.

దీంతో ఈ ఫిర్యాదులపై అమెరికా కోర్ట్ విచారించి, తన తుది తీర్పును వెలువరించింది. కస్టమర్ల నుంచి చట్ట విరుద్దంగా గూగుల్ కంపెనీకి సమకూరిన డబ్బును వారికే తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చేసేదేమీ లేక రూ. 5800 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది గూగుల్. కాగా.. అధికమెుత్తంలో యాప్ కొనుగోళ్లకు చెల్లించిన కస్టమర్లకు 630 మిలియన్లు అంటే సుమారు రూ. 5200 కోట్లు అందనున్నాయి. మిగిలిన సొమ్మును రాష్ట్రాలకు చెల్లిస్తారు. ఈ క్రమంలోనే ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ కు సంబంధించి కొన్ని మార్పులు తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరి ఇంత భారీ మెుత్తంలో గూగుల్ పరిహారాన్ని చెల్లించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి