iDreamPost

ఎంత త్వరగా పేరు తెచ్చుకున్నాయో… అంత త్వరగా బ్యాన్ అయ్యాయి..

ఎంత త్వరగా పేరు తెచ్చుకున్నాయో… అంత త్వరగా బ్యాన్ అయ్యాయి..

చైనా ఆప్స్ వినియోగం తగ్గించి స్వదేశీ అప్లికేషన్లను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వెలుగులోకి వచ్చిన రిమూవ్ చైనా ఆప్స్ మరియు Mitron అప్లికేషన్లకు గూగుల్ షాక్ ఇచ్చింది.

తమ ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధంగా ఉన్నందున ఈ అప్లికేషన్లను ప్లే స్టోర్ నుండి తొలగించింది. దీంతో సదరు అప్లికేషన్లను రూపొందించినవారికి చుక్కెదురైంది. టిక్ టాక్ క్లోన్ లా ఉండే Mitron అప్లికేషన్ ఇప్పటికే 5 మిలియన్ల డౌన్లోడ్స్ ని సొంతం చేసుకుంది. రిమూవ్ చైనా ఆప్స్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్స్ లో దూసుకుపోయింది. దాదాపు 5 మిలియన్ డౌన్లోడ్స్ సొంతం చేసుకుంది. మన ఫోన్ లో ఉన్న చైనా ఆప్స్ ని గుర్తించి తొలగించేందుకు వీలుగా రిమూవ్ చైనా ఆప్స్ ఉపయోగపడుతుంది.

కానీ థర్డ్ పార్టీ అప్లికేషన్లను తొలగించడానికి లేదా నిలిపివేయడానికి లేదా మొబైల్ సెట్టింగులను సవరించడానికి వినియోగదారులను ప్రోత్సహించే లేదా ప్రోత్సహించే అప్లికేషన్లను అనుమతించని విధానాన్ని ఉల్లంఘించినందుకు రిమూవ్ చైనా ఆప్స్ ని ప్లే స్టోర్ నుండి తొలగించినట్లు గూగుల్ ప్లే స్టోర్ వివరణ ఇచ్చింది..

Mitron అప్లికేషన్ కూడా ప్లే స్టోర్ పాలసీని ఉల్లంఘించిందని అందుకే తొలగించామని ప్లే స్టోర్ తెలిపింది. ఒకవేళ తాము ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడి అప్లికేషన్ లో మార్పులు చేస్తే తిరిగి ప్లే స్టోర్ లోకి ఆహ్వానిస్తామని గూగుల్ వెల్లడించింది. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారికి mitron సేవలు లభిస్తాయని కానీ వినియోగదారులకు గోప్యతకు హాని జరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడింది..తమ మార్గదర్శకాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించుకుంటే Mitron అప్లికేషన్ తిరిగి ప్లే స్టోర్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

కానీ రిమూవ్ చైనా ఆప్స్ అప్లికేషన్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్ లో లభించే అవకాశం లేదు. ఎందుకంటే చైనా అప్లికేషన్లను రిమూవ్ చేసే ప్రక్రియను ప్రోత్సహించడం ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధం కావున కేవలం చైనా ఆప్స్ ని తొలసించేందుకు మాత్రమే ఆ అప్లికేషన్ రూపొందించారు కావున తిరిగి ప్లే స్టోర్ లో mitron అప్లికేషన్ చూసే అవకాశం ఉంటుంది కానీ రిమూవ్ చైనా ఆప్స్ మాత్రం కనిపించే అవకాశం లేదు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి