iDreamPost

Incognito Window: డేటా సేవ్ చేసిన గూగుల్! 41 వేల కోట్ల దావాతో.. డేటా డిలీట్!

గూగుల్ ఇన్ కాగ్నిటో మోడ్ సెర్చ్ కి సంబంధించిన డేటా అందరూ ఎంతో భద్రంగా ఉంటుంది అనుకుంటారు. కానీ, గూగుల్ రియాక్ట్ అయిన తీరు చూస్తే అది నిజం కాదని అర్ధమైపోతోంది. దావాకి సంబంధించి గూగుల్ సంస్థ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

గూగుల్ ఇన్ కాగ్నిటో మోడ్ సెర్చ్ కి సంబంధించిన డేటా అందరూ ఎంతో భద్రంగా ఉంటుంది అనుకుంటారు. కానీ, గూగుల్ రియాక్ట్ అయిన తీరు చూస్తే అది నిజం కాదని అర్ధమైపోతోంది. దావాకి సంబంధించి గూగుల్ సంస్థ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

Incognito Window: డేటా సేవ్ చేసిన గూగుల్! 41 వేల కోట్ల దావాతో.. డేటా డిలీట్!

స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సమాచారం ఏది రహస్యంగా ఉందో.. ఏది బయటకు పొక్కుతుందో కూడా ఊహించలేని పరిస్థితి. ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఏ సమాచారం బయటకు లీక్ అవుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. వ్యక్తిగత గోప్యత అనేది ఈరోజుల్లో ఓపెన్ జోక్ అయిపోయింది. ప్రతి యాప్, ప్రతి టెక్ సంస్థ యూజర్ డేటాతో వ్యాపారం చేస్తోంది. అందుకు గూగుల్ కూడా అతీతం కాదని పలు సందర్భాల్లో వ్యక్తమైంది. తాజాగా మరోసారి గూగుల్ క్రెడిబిలిటీ ప్రమాదంలో పడింది. తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించడమే కాకుండా.. యూజర్ డేటాను డిలీట్ చేసేందుకు గూగుల్ సంస్థ సిద్ధమైంది. ఇన్ కాగిటో మోడ్ లో చేసే సెర్చ్ కి సంబంధించి గూగుల్ పై ఒక పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ కి సంబధించి గూగుల్ ఇప్పుడు డేటాను డిలీట్ చేసేందుకు రెడీ అయిపోయింది.

గూగుల్ సంస్థ లక్షలాది మంది యూజర్ డేటాను డిలీట్ చేసేందుకు సిద్ధమైపోయింది. 2020 జూన్ లో గూగుల్ సంస్థపై కొందరు అమెరికాకి చెందిన వాళ్లు దావా వేశారు. గూగుల్ క్రోమ్ ‘ఇన్ కాగ్నిటో మోడ్’లో సెర్చ్ చేసిన యూజర్ డేటాను గూగుల్ సంస్థ తమ వ్యాపార లబ్ధికి వాడుకొందని ఆరోపణలు చేశారు. ఈ విషయం అంతర్గత ఈమెల్స్ ద్వారా బయటకు పొక్కిందని వెల్లడించారు. ఇన్ కాగ్నిటో మోడ్ లో సెర్చ్ చేస్తే యూజర్స్ తమ డేటా భద్రంగా ఉంటుంది అనుకుంటారు. ఆ మోడ్ లో చేసిన్ సెర్చ్ కి సంబంధించి తమ వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలియవు అని నమ్ముతారు. గూగుల్ సంస్థ ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది అంటున్నారు.

Incognito mode

వెబ్ ట్రాఫిక్ అంచనాకు, కమర్షియల్ యాడ్స్ కోసం ఈ డేటాను వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గూగుల్ పై 5 బిలియన్ డాలర్ల(రూ.41 వేల కోట్లు)కు దావా వేశారు. ఈ దావాకి సంబంధించి గూగుల్ ఎక్కడా కూడా డబ్బు చెల్లించే విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ, యూజర్స్ డేటా డిలీట్ చేసేందుకు మాత్రం గూగుల్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. గూగుల్ ప్రతిపాదనకు శాన్ ఫ్రాన్సిస్ కో కోర్టు అంగీకరిస్తే ఇన్ కాగ్నిటో మోడ్ లో సెర్చ్ చేసిన లక్షలాది మంది అమెరికన్స్ డేటాను గూగుల్ సంస్థ డిలీట్ చేయాల్సి ఉంటుంది. క్రోమ్ డేటా వల్ల ప్రభావితం అయ్యామని భావించిన యూజర్స్ పరిహారం కోసం సెపరేట్ గా దావా వేసుకోవాలని గూగుల్ వెల్లడించింది.

ఈ దావాపై గూగుల్ సంస్థ అధికార ప్రతినిధి జార్జ్ కాస్టానెడ స్పందించారు. అసలు ఈ దావాలో విషయం లేదని చెప్పుకొచ్చారు. యూజర్ డేటాని సేకరించిన విషయాన్ని ఆయన అంగీకరించారు. కానీ, ఆ డేటాను ఏ వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకోలేదు అంటూ స్పష్టం చేశారు. ఆ డేటా సేకరణ కేవలం టెక్నికల్ పర్పస్ కోసం మాత్రమేనని చెప్పారు. అవసరం అయితే ఆ డేటాను డిలీట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ దావాపై జులై 30న కోర్టు విచారణ జరపనుంది. మరి.. ఇన్ కాగ్నిటో సెర్చ్ మోడ్ లో యూజర్ డేటాను సేకరిస్తున్నామని గూగుల్ ఒప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి