iDreamPost

ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవాలా? ఇప్పుడు గూగుల్ తల్లిని అడగండి

ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవాలా? ఇప్పుడు గూగుల్ తల్లిని అడగండి

మనకు ఏ సందేహం, అవసరం వచ్చినా వెంటనే మొబైల్ తీసి గూగుల్ తల్లిని అడిగేస్తాం. అందుకే గూగుల్ కూడా మనకు తగ్గట్లుగా అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజాగ వచ్చిన కూల్ అప్ డేట్ కూడా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

మారుతున్న వాతావరణంతో పాటు గాలి నాణ్యతలోనూ మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి మీ ఏ ప్రాంతంలో ఉన్నా, అక్కడి గాలి నాణ్యతను చెక్ చేసేందుకు ఇప్పుడు గూగుల్ కొత్త ఫీచర్ను ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ గూగల్ మ్యాప్స్ లో అందుబాటులోకి రానుంది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ , గాలి ఎంత ఆరోగ్యంగా (లేదా అనారోగ్యకరంగా) ఉంది అనే కొలత, అవుట్ డోర్ కార్యకలాపాలకు గైడెన్స్ తో పాటు, చివరిసారిగా అప్ డేట్ అయిన సమాచారాన్ని కూడా మీకు చూపిస్తుంది గూగుల్.

వివిధ ప్రదేశాలకు ప్రయాణాలు చేసేవారికి ఈ ఫీచర్ మరింత సహాయపడుతుంది. ప్రభుత్వ సంస్థలతో పాటు, గూగుల్ పర్పుల్ ఎయిర్ నుండి గాలి నాణ్యత సమాచారాన్ని కూడా చూపిస్తుంది, ఇది తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్ నెట్ వర్క్ గా గూగుల్ చెప్తోంది. పరిస్థితులకు మరింత హైపర్ లోకల్ వీక్షణను ఇస్తుందని చెప్తోంది గూగల్.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి