iDreamPost

మేడారం భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటి నుంచే మొక్కుల చెల్లింపు

  • Published Feb 08, 2024 | 1:19 PMUpdated Feb 08, 2024 | 1:19 PM

భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతరలలో మేడారంలో జరిగే 'సమ్మక్క- సారక్క' జాతర ఒకటి. అయితే, అంత దూరం వెళ్లలేని భక్తులకు.. మొక్కులు చెల్లించుకునే దిశగా.. తెలంగాణ దేవాదాయ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

భారతదేశంలో జరిగే అతిపెద్ద జాతరలలో మేడారంలో జరిగే 'సమ్మక్క- సారక్క' జాతర ఒకటి. అయితే, అంత దూరం వెళ్లలేని భక్తులకు.. మొక్కులు చెల్లించుకునే దిశగా.. తెలంగాణ దేవాదాయ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published Feb 08, 2024 | 1:19 PMUpdated Feb 08, 2024 | 1:19 PM
మేడారం భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటి నుంచే మొక్కుల చెల్లింపు

ప్రపంచం ఆధునిక యుగంలో ముందుకు వెళ్తున్న కొద్దీ.. అన్ని అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. వాటిలో మంచి చెడులు ఉండడం సహజం. ఈ క్రమంలోనే తాజాగా ఆన్ లైన్ ద్వారా తమ మొక్కులను చెల్లించుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. సాధారణంగా పెద్ద దేవాలయాలకు, జాతరలకు వెళ్లాలని ఎంతో మంది అనుకుంటారు. కానీ, ఆరోగ్య రీత్యా , వయసు రీత్యా కొంతమంది ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడి వరకు వెళ్లలేని వారు సైతం .. వారి మొక్కులను ఆన్ లైన్ ద్వారా చెల్లించుకునే మార్గాన్ని రూపొందించారు. అది వెసులుబాటు దేనికి సంబంధించిందంటే.. తెలుగు వారికీ ఎంతో ప్రత్యేకమైన మేడారం సమ్మక్క- సారక్క జాతర. ఈ జాతరకు వెళ్లలేని భక్తులు.. వారి మొక్కులను ఆన్ లైన్ ద్వారా సమర్పించవచ్చని.. తెలంగాణ దేవాదాయ శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఆసియాలోనే అతి పెద్ద జాతర ఏది అంటే.. మహా కుంభమేళా తర్వాత .. అందరు మాట్లాడుకునేది మేడారం సమ్మక్క- సారక్క జాతర గురించే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ జాతర అత్యంత ప్రత్యేకం . కేవలం తెలుగు ప్రజలే కాకుండా .. దేశంలోని నలుమూలలా నుంచి ఈ జాతర చూసేందుకు .. ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఈ జాతరకు మొత్తంగా దాదాపు కోటి మంది భక్తుల వరకు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. కాగా, ఈ జాతర రెండేళ్లకు ఓసారి.. మాఘమాసంలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఎంతో కన్నుల పండుగగా జరిగే ఈ గిరిజనుల జాతరలో పాల్గొని .. మొక్కులు చెల్లించుకుంటే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో ఈ ఏడాది .. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు .. మేడారం సమ్మక్క – సారక్క జాతర జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

అయితే , మేడారం జాతర అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది.. ఎత్తు బంగారం మెుక్కులు. దానిని బెల్లం మెుక్కులు అంటారు. చాలా మంది వారి కోరికలు తీరితే ఎత్తు బంగారం సమర్పించుకుంటామని.. అమ్మవార్లకు మెుక్కుకుంటారు. ఈ క్రమంలో ఈ జాతరకు వెళ్లలేని భక్తులకు.. తెలంగాణ దేవాదాయశాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడి వరకు వెళ్లే వీలుకాక మొక్కులు చెల్లించలేని భక్తులకు .. ఇదొక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. అది ఏంటంటే.. భక్తులు వారి ఇంటి వద్ద నుంచే మొక్కులు చెల్లిచుకునే అవకాశాన్ని కల్పించింది. ఆన్ లైన్ ద్వారా మీ సేవ, పోస్టాఫీసు, టీ యాప్‌ ఫోలియో ద్వారా మెుక్కులు చెల్లింపు కోసం బుకింగ్ అవకాశం కల్పించారు. అది ఎలా అంటే భక్తులు వారి బరువు ప్రకారం కిలోకు రూ.60 చొప్పున చెల్లించి.. నిలువెత్తు బంగారం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇక ఆ బెల్లాన్ని భక్తుల పేరు మీద దేవాదాయశాఖకు చెందిన సిబ్బంది అమ్మవార్లకు సమర్పిస్తారు. దీనికి సంబంధించిన సేవలను దేవాదాయశాఖ మంత్రి.. కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు. అంతేకాకుండా పోస్టల్ డిపార్డ్‌మెంట్ ద్వారా మేడారం ప్రసాదం సైతం పొందే అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. మరి, ఈ ఆన్ లైన్ మొక్కుల చెల్లింపు వినియోగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి