iDreamPost

పండగ వేళ AP కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు

ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురును అందించింది. పండగ వేళ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి దసరా కానుకను అందించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురును అందించింది. పండగ వేళ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి దసరా కానుకను అందించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పండగ వేళ AP కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు

ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురును అందించింది. పండగ వేళ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి దసరా కానుకను అందించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో కాంట్రాక్ట్ ఉద్యోగులు.. రెగ్యులర్ ఉద్యోగులుగా మారారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కార్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమంబద్దీకరణ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. సభ్యుల ఆమోదంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది. గవర్నర్ ఆమోదం కోసం ఈ బిల్లును పంపగా తాజాగా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది.

కాంట్రాక్టు ఉద్యోగుల ఎన్నో ఏళ్ల కళను సీఎం జగన్‌ నెరవేర్చి చూపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సాదకబాదకాలను తెలుసుకున్న జగన్ గొప్ప మనసుతో ఆలోచించి రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ శాఖల్లో ఉన్న సుమారు 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్‌ అయ్యారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్‌ సడలించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తున్నందుకు సీఎంకు ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి