iDreamPost

గోదావ‌రికి భారీ వ‌ర‌ద‌.. క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర చేశారా? కేసీఆర్‌ అనుమానాలు

గోదావ‌రికి భారీ వ‌ర‌ద‌..  క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర చేశారా? కేసీఆర్‌ అనుమానాలు

క్లౌడ్ బ‌రస్ట్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. క్లౌడ్‌ బరస్ట్‌ పద్ధతిలో అక‌స్మాత్తుగా వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ అనుమానించారు. ఇంత‌కుముందు కశ్మీర్‌, లేహ్‌ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు క‌థ‌నాలొచ్చాయి. ఇతర దేశాలకు క్లౌడ్‌ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేసే టెక్నాల‌జీ ఉంద‌న్న‌ చర్చ జరిగింద‌న్నారు. జులైలో గోదావరి ప్రాంతంలో ఇంత వ‌ర‌కు ఎన్న‌డూ లేద‌ని, క్లౌడ్‌ బరస్ట్‌ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.

వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం కరకట్ట సామ‌ర్ధ్యాన్ని పరిశీలించారు. భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరం. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం కోసంక‌ట్టు దిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ నిర్మిస్తామ‌ని భ‌రోసానిచ్చారు కేసీఆ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి