iDreamPost

Goa: గోవాలో కొత్త ట్రెండ్.. కాసులు కురిపిస్తున్న వర్క్ ఫ్రమ్ బీచ్ కాన్సెప్ట్!

  • Published Mar 25, 2024 | 3:38 PMUpdated Mar 25, 2024 | 3:38 PM

సమ్మర్ సీజన్ వచ్చేసింది. అంటే, ఇక చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వారి వరకు అందరు వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మోస్ట్ విసిటింగ్ స్పాట్ అయిన గోవాలో వర్క్ ఫ్రమ్ బీచ్ అంటూ.. కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది.

సమ్మర్ సీజన్ వచ్చేసింది. అంటే, ఇక చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వారి వరకు అందరు వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మోస్ట్ విసిటింగ్ స్పాట్ అయిన గోవాలో వర్క్ ఫ్రమ్ బీచ్ అంటూ.. కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది.

  • Published Mar 25, 2024 | 3:38 PMUpdated Mar 25, 2024 | 3:38 PM
Goa: గోవాలో కొత్త ట్రెండ్.. కాసులు కురిపిస్తున్న వర్క్ ఫ్రమ్ బీచ్ కాన్సెప్ట్!

వేసవికాలం అంటే అందరికి గుర్తొచ్చేది వెకేషన్స్. ఎందుకంటే, పిల్లలకు ఈ సమయంలో స్కూల్స్ కు హాలిడేస్ వస్తుంటాయి కాబట్టి.. అందరు వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అది కూడా ఎటైనా చల్లని ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అందరు వెళ్ళాలి అనుకునే మోస్ట్ విసిటింగ్ ప్లేస్, ముఖ్యంగా యూత్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువగా వెళ్ళాలి అనుకునే ప్లాన్ చేసే ప్లేస్ .. అదే గోవా. గోవా కు వెళ్లాలని ఎంతో మంది ప్లాన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎదో ఒక సమయం చూసుకుని ఫ్రెండ్స్ తో సరదాగా స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ, వర్కింగ్ ఎంప్లాయిస్ కు మాత్రం ఇలా వెళ్లడం కాస్త కష్టంగా ఉంటుంది. వారికి వెళ్లాలని ఉన్నా కూడా.. ఉద్యోగం కారణంగా వెళ్ళలేరు. అయితే, ఇటువంటి వారికి గోవా ప్రభుత్వం ఓ కొత్త కాన్సెప్ట్ ను ఇంట్రడ్యూస్ చేసింది. అదే వర్క్ ఫ్రమ్ బీచ్ కాన్సెప్ట్.

ఇప్పటివరకు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి విన్నాము. కోవిడ్ తర్వాత ఈ కాన్సెప్ట్ ఇండియాలో మేజర్ రోల్ ప్లే చేసింది. ఇక ఇప్పుడు అందరిని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయమని.. ఆయా సంస్థలు ఆదేశాలు జారీ చేస్తున్న క్రమంలో.. గోవా ప్రభుత్వం మాత్రం కొత్తగా .. వర్క్ ఫ్రమ్ బీచ్ కాన్సెప్ట్ ను ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఇక్కడ బీచ్ లో నుంచే అందరూ తమ వర్క్ ను బీచ్ నుంచే చేసుకోవచ్చంటూ.. గోవా సీఎం ప్రమోదర్ సావన్ ప్రకటించారు. “ప్రజలు అంతా గోవా బీచ్ కు రావొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, అదే విధంగా వర్క్ చేసుకోవచ్చు. ఈ దిశగా డిజిటల్ నో మ్యాడ్ విధానం తీసుకొస్తున్నాం. స్థానికంగా ప్రతి గ్రామం.. డిజిటల్ గా అనుసంధానం అయ్యి ఉంది. దాదాపు ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ సదుపాయం త్వరలో పూర్తి కానుంది. కాబట్టి మేము బీచ్ నుంచి పని చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా పర్యాటకులు ఎంజాయ్ చేస్తూ.. వర్క్ చేసుకోవచ్చు. దీనికి తగిన వాతావరణం కల్పిస్తాము.” అంటూ గోవా సీఎం వెల్లడించారు.

ఇప్పటికే బీచ్ లో కూర్చుని తమ ఆఫీస్ పనులను చేసేలా కో వర్కింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేస్తుంది.. గోవా ప్రభుత్వం. పర్యాటకులకు హాట్ స్పాట్ గా ఉన్న గోవాను మరింత అభివృద్ధి చేసే దిశగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎన్నో దేశాల నుంచి ఇక్కడకు పర్యాటకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎక్కువ శాతం మంది గోవాకు వస్తారు. దీనితో వారి కోసం కో వర్కింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేస్తే.. మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఇక మరో వైపు గోవాలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా.. గోవా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏదేమైనా ఈ వర్క్ ఫ్రమ్ బీచ్ కాన్సెప్ట్ అనేది అందరికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని చెప్పి తీరాలి. మరి, గోవా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన వర్క్ ఫ్రమ్ బీచ్ కాన్సెప్ట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి