iDreamPost

ఇక ట్యాంక్ బండ్ పై అలాంటి పనులు నిషేధం! తస్మాత్ జాగ్రత్త!

హైదరాబాద్ లో ఉండేవారు చాలా వరకు వివాహవేడుకలు, పుట్టిన రోజు కార్యక్రమాలు ట్యాంక్ బండ్ పై కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరుపుకుంటారు.

హైదరాబాద్ లో ఉండేవారు చాలా వరకు వివాహవేడుకలు, పుట్టిన రోజు కార్యక్రమాలు ట్యాంక్ బండ్ పై కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరుపుకుంటారు.

ఇక ట్యాంక్ బండ్ పై అలాంటి పనులు నిషేధం! తస్మాత్ జాగ్రత్త!

ఒకప్పుడు పుట్టిన రోజు వేడుకలు ఇంటి సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకునేవారు.. కానీ ఈ మద్య యువత కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. రోడ్లపై కార్లు, బైకులు ఆపి వాటిపై కేక్ కటింగ్ చేస్తున్నారు. పార్కులు, నిర్జీవ ప్రదేశాలు, ఎత్తైన భవనాలు, సముద్ర తీరాలు ఇలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. కొన్నిసార్లు పుట్టిన రోజు వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల అపశృతులు కూడా జరుగుతున్నాయి.. దీంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటి నుంచో ట్యాంక్ బండ్ వద్ద అర్ధరాత్రి కేక్ కట్ చేయడం లాంటివి చేస్తూ వస్తున్నారు. దీని వల్ల ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాంక్ బండ్ పై కేక్ కట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో నివసించే ప్రజలు పెళ్లిళ్ళు, పుట్టిన రోజు వేడుకలు.. ఇతర శుభకార్యాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. చాలా మంది హైదరాబాదీలు ట్యాంక్ బండ్ పై అర్ధరాత్రి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. అర్థరాత్రి ట్యాంక్ బండ్ పై కేక్ కట్ చేస్తే ఆ ఎంజాయ్ మెంట్ వేరు అంటారు. అందుకే యూత్ ట్యాంక్ బండ్ పై బర్త్ డే వేడుకలు నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆ మధుర క్షణాలు తమ ఫోన్లలో బంధించి మురిసిపోతుంటారు. ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ట్యాంక్ బండ్ పై ప్రయాణించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేక్ కట్ చేసిన తర్వాత అక్కడ చెత్తా చెదారం వేయడం, కొంతమంది మందుబాబులు బాటిల్స్ పగులగొట్టడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం లాంటివి చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ట్యాంక్ బండ్ పై కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి జీహెచ్ఎంసీ స్వస్తి పలికింది. కేక్ కట్ చేసిన తర్వాత ఇతర వ్యర్ధాలు తీసి వేయకుండా అక్కడే పడవేసి వెళ్తుండటంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా ట్యాంక్ బండ్ పై పుట్టిన రోజు, ఇతర వేడుకలు నిర్వహించకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్ నిషేదం.. ఒకవేళ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటా భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్, ఇతర వేడుకల ముసుగులో వ్యర్థాలను వేస్తే.. సీసీ కెమెరాల నిఘాతో పట్టుకొని జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంతో కొంతమంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఇలాంటి నిర్ణయం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, న్యూసెన్స్ చాలా వరకు అరికట్టవొచ్చని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నిర్ణయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి