iDreamPost

Allu Arjun-Atlee: బన్నీ-అట్లీ కాంబో సెట్.. దిమ్మతిరిగే అప్డేట్!

అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందబోతోందని గత కొన్ని రోజులగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన దిమ్మతిరిగే అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందబోతోందని గత కొన్ని రోజులగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన దిమ్మతిరిగే అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Allu Arjun-Atlee: బన్నీ-అట్లీ కాంబో సెట్.. దిమ్మతిరిగే అప్డేట్!

ఇండస్ట్రీలో కాంబినేషన్ రివీల్ అవ్వగానే ఆ మూవీపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. ప్రస్తుతం అలాంటి ఓ కాంబినేషన్ కు సంబంధించిన న్యూసే పరిశ్రమను షేక్ చేస్తోంది. అదేంటంటే? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందబోతోందని గత కొన్ని రోజులగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన దిమ్మతిరిగే అప్డేట్ సోషల్ మీడియాను అల్లాడిస్తోంది.

అల్లు అర్జున్.. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారడంతో పాటుగా.. ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం పుష్ఫ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ కొన్ని సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. అందులో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కాగా.. ఇంకోటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో. ఇక ఈ రెండు చిత్రాలతో పాటుగా ‘జవాన్’ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ సెట్ అయ్యింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాను నిర్మిస్తున్నంది ఏ నిర్మాణ సంస్థలో తెలుసా? ఈ మూవీని ఏకంగా సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల విశ్వసనీయ సమాచారం. కాగా.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే? ఈ ఫిల్మ్ కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేసే యోచనలో ఉన్నారట మూవీ మేకర్స్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ముందు సెట్ అయిన త్రివిక్రమ్, సందీప్ రెడ్డి సినిమాల తర్వాత ఈ మూవీ ఉంటుందా? లేక ముందే ఈ కాంబో తెరమీదికి వస్తుందా? అన్నది వేచి చూడాలి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: థియేటర్ల ఓనర్స్ సంచలన నిర్ణయం.. సినిమా రిలీజులపై నిషేధం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి