iDreamPost

థియేటర్ల ఓనర్స్ సంచలన నిర్ణయం.. సినిమా రిలీజులపై నిషేధం!

థియేటర్ల ఓనర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని మూవీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

థియేటర్ల ఓనర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని మూవీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

థియేటర్ల ఓనర్స్ సంచలన నిర్ణయం.. సినిమా రిలీజులపై నిషేధం!

మూవీ లవర్స్ కు ఈ వార్త షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే? ఫిబ్రవరి 22 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని మూవీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో థియేటర్లలో మూవీల రిలీజెస్ లేనట్లే. అయితే ఈ నిషేధం తెలుగు రాష్ట్రాల్లో కాదు.. కేరళలో. అవును కేరళలో థియేటర్లలో ఫిబ్రవరి 22 నుంచి సినిమాలు విడుదల కావు. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

కేరళలో థియేటర్ల ఓనర్స్ కు నిర్మాతలకు మధ్యగత రెండేళ్లుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గొడవలు మరింతగా ముదిరాయి. దీంతో కేరళ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మలయాళ సినిమాలను ప్రదర్శించకూడదని కేరళ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో మలయాళ సినిమా ఇండస్ట్రీ సందిగ్దంలో పడింది. శుక్రవారం(ఫిబ్రవరి 16)న సమావేశం అయిన కేరళ మూవీ ఓనర్స్ అసోసియేషన్ ఫిబ్రవరి 22 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఎలాంటి సినిమాలను రిలీజ్ చేయబోమని ప్రకటించింది. అసలు విషయం ఏంటంటే?

ఓటీటీ సినిమా రిలీజుల విషయంలో కేరళ థియేటర్ల ఓనర్స్ వ్యతిరేకంగా ఉన్నారు. సినిమా విడుదలైన నెల రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలన్నది వారి డిమాండ్. ఇందుకోసం అసోసియేషన్ ఓ నిబంధన కూడా తెచ్చింది. కానీ ఆ రూల్ ను కొందరు నిర్మాతలు ఉల్లంఘిస్తూ వచ్చారు. దీంతో వీరు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదీకాక తాజాగా మోహన్ లాల్ నటించిన ‘మలైకొట్టై వాలిబన్’ మూవీ కొద్ది రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది థియేటర్ల యజమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. వారు తీసుకున్న నిర్ణయం థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల పాలిట శాపంగా మారింది. మరి ఈ కేరళ థియేటర్ల ఓనర్లు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: OTTలో క్రైమ్ థ్రిల్లర్స్ కి బాబు లాంటిది.. ఒక్కో సీన్ కి ఉత్కంఠతో..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి