iDreamPost

వీడియో: కోహ్లీ ఫ్యాన్స్ కు మిడిల్ ఫింగర్ చూపించిన గంభీర్!

వీడియో: కోహ్లీ ఫ్యాన్స్ కు మిడిల్ ఫింగర్ చూపించిన గంభీర్!

టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ హీరో, బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ తన స్థాయి మర్చిపోయి ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. కోహ్లీ ఫ్యాన్స్- గౌతమ్ గంభీర్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. కోహ్లీకి గంభీర్ కు మధ్య సఖ్యత లేదని.. వాళ్లు ఎప్పుడూ ఉప్పు- నిప్పులా ఉంటారని గట్టిగానే టాక్ ఉంది. అందుకు బలం చేకూరుస్తూ జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. మరోసారి కోహ్లీ ఫ్యాన్స్ ఆ వివాదాన్ని మరింత పెంచినట్లు అయింది. కోహ్లీ ఫ్యాన్స్ చేసిన పనికి గంభీర్ బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేస్తూ కోహ్లీ ఫ్యాన్స్ నానా హంగామా చేయడం ఇంకా మానలేదు. తాజాగా భారత్- నేపాల్ జరుగుతున్న సమయంలో గౌతమ్ గంభీర్ మైదానం దగ్గరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడున్న కోహ్లీ ఫ్యాన్స్ అంతా గోల చేయడం ప్రారంభించారు. గంభీర్ ని చూస్తూ కోహ్లీ కోహ్లీ అంటూ కేకలు వేశారు. మొదట ఏమీ పట్టనట్లు వెళ్తున్న గంభీర్.. కోహ్లీ పేరు వినగానే వెనక్కి తిరిగి చాలా కోపంగా కేకలు వేస్తున్న వాళ్లకి అభ్యంతరకరంగా మిడిల్ ఫింగర్ చూపించి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గంభీర్ లాంటి సీనియర్, ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు గంభీర్ కు మద్దతు కూడా చెబుతున్నారు. ఎందుకంటే కోహ్లీ ఫ్యాన్స్ ప్రతిసారి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదని వారిస్తున్నారు. గంభీర్ లాంటి ఒక గొప్ప ఆటగాడిని పదే పదే ఇలా హేళన చేయడం సబబు కాదంటూ హితవు పలుకుతున్నారు. సమసి పోయింది అనుకుంటున్న వివాదం మరోసారి హీటెక్కినట్లు అయింది. గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చేసిన పనికి.. గంభీర్ ఫ్యాన్స్ నెట్టింట సమాధానాలు చెబుతున్నారు. మరోసారి ఇరువురి ఫ్యాన్స్ నెట్టింట యుద్ధం మొదలెట్టేశారు.

ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. నేపాల్ జట్టు ఓపెనర్లు కాసేపు టీమిండియా బౌలర్లను కంగారు పెట్టారు. ఆసిఫ్ 8 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లను గట్టిగానే సవాలు చేశాడు. కుషల్ భూర్టెల్ కేవలం 25 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. రెండు సిక్సర్లు, 3 ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కాసేపు టీమిండియా బౌలర్లు చెలరేగారు. సోంపాల్ కమీ కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నాడు. 56 బంతుల్లో 2 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో 48 పరుగులు చేశాడు. తృటిలో అర్ధ శతకాన్ని మిస్ అయ్యాడు. మొత్తానికి 48.2 ఓవర్లలో 230 పరులుకు ఆలౌట్ అయ్యారు. టీమిండియా బౌలింగ్ చూస్తే.. జడేజా, సిరాజ్ లకు చెరో 3 వికెట్లు, షమీ, హార్దిక్, శార్దూల్ ఠాకూర్ లకు తలో వికెట్ దక్కింది. టీమిండియా విజయం కోసం 231 పరుగులు చేయాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి