iDreamPost

గ్యాస్ లీక్ ఘటన – అధికారుల నుండి పూర్తి వివరాలు రాబట్టిన సీఎం జగన్

గ్యాస్ లీక్ ఘటన –  అధికారుల నుండి పూర్తి వివరాలు రాబట్టిన సీఎం జగన్

విశాఖలో ఈ రోజు ఉదయం జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటన్ పై భాదితులని పారామర్శించేందుకు హుటాహుటిన విశాఖ బయలుదేరిన సి.యం జగన్ తోలుత ఆసుపత్రుల్లో ఉన్న భాదితులని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. వారికి అందించే వైద్య సదుపాయాల పట్ల ఆరాతీశారు. భాదితులకి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. భాదితులకి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఉన్నతాదికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

సంఘటన గురించిన పూర్తీ వివరాలు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివరించారు. సేఫ్టీ సిస్టం ఫెయిల్యూర్ వల్ల తెల్లవారుజామున 3:45 ప్రమాదం జరిగిందని చెప్పారు. స్టైరిన్ కెమికల్ నింపిన రెండు ట్యాకులు ఉన్నాయి. అందులో ఒకటి 2500 కె.యల్, మరొకటి 3500 కె.యల్ అని.. అయితే ఈ లీకేజ్ మొత్తం 2,500 కె.యల్ ట్యంకు నుంచి లీకైనట్లు వివరించారు. మొదలైనట్టు చెప్పుకొచ్చారు, ప్రస్తుతం ఆ ట్యాంకులో 1800 కె.యల్ మాత్రమే ఉందని తెలిపారు. ఈ కెమికల్ లిక్విడ్ ఫాంలో ఉంటుందని దీనిని 20% సెల్సియస్ కన్న తక్కువలో ఉంచితేనే లిక్విడ్ ఫాంలో సేఫ్ గా ఉంటుందని వివరించారు. అయితే సాంకేతిక సమస్య ఏర్పడటం వలన రిఫ్రిజిరేటర్ పనిచేయకపొవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరిగి లిక్విడ్ ఫాం లో ఉన్న కెమికల్, గ్యాస్ గా రూపాంతరం చెంది లీకైనట్లు చెప్పారు. వెంకటాపురం, పద్మనాభపురం, బీసీ కాలనీ, ఎస్సి కాలనీలను ప్రభావితం చెసిందని వివరించారు.

లీకైన గ్యాస్ ఉదయం 3.45 నుండి 5.30 వరకు తీవ్ర ప్రభావం చూపిందని, మనిషి నిల్చోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. సమాచారం అందిన వెంటనే ఉదయం 5 గంటల నుంచి బాదితులని ఆసుపత్రులకు చేర్చడం ప్రారంభించామని తెలిపారు. ప్రాభావితమైన ప్రాంతాలను ఎయిర్ కార్గో హెలికాఫటర్ల ద్వారా టి.డీ.యం. అనే యాంటి డోట్ ను చల్లుతున్నమని వివరించారు. అయితే ప్రభావితమైన ప్రాంతాలను 48 గంటల తర్వాత పరీక్షించి సురక్షితమైనవని నిర్ధారణకు రావచ్చని వివరించారు.

ఈ గ్యాస్ లీక్ వలన ప్రభావితమైన వారికి శ్వాసకోస, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల 2 కిలోమీట్ల వరకు ప్రభావిత ప్రాంతాలవారిని పూర్తిగా ఈ గ్యాస్ తగ్గిపోయే వరకు సదరు ప్రాంతాలకు దురంగా ఉండమని సూచించామని వివరించారు.

ముఖ్యమంత్రి జగన్ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను అధికారులను అడిగి మరీ తెలుస్కోవడం కనిపించింది. వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటు, నోట్ చేసుకున్నారు. గ్యాస్ ప్రభావితం ఎంత వరకు ఉంటుంది..? అది పూర్తిగా తొలగిపొవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి..? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది..? తదితర వివరాలను రాబట్టారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తో పాటు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని, పట్టణ, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి