iDreamPost
android-app
ios-app

Gangs Of Godavari OTT: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ OTT లోకి వచ్చేసింది..

  • Published Jun 14, 2024 | 8:11 AM Updated Updated Jun 14, 2024 | 8:11 AM

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది . థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు.. ఈ సినిమా కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది . థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు.. ఈ సినిమా కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 14, 2024 | 8:11 AMUpdated Jun 14, 2024 | 8:11 AM
Gangs Of Godavari OTT: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ OTT లోకి వచ్చేసింది..

ఇప్పటికే ఈ వారం ఏ ఏ సినిమాలు.. ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో.. వాటిలో ఏ సినిమాలు చూడాలి.. ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి… వీకెండ్ సజ్జెషన్స్ అని వీకెండ్ రిమైండర్ అని.. ఇలా వీకెండ్ సినిమాల లిస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆ సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేవరకు.. ఆ సినిమాల గురించి బజ్ నడుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ వారం పక్కా ఎంటర్టైన్మెంట్ అందించడానికి.. చాలానే సినిమాలు రెడీ గా ఉన్నాయి. ఈ క్రమంలో.. విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షలను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

విశ్వక్ నడిచిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గామి సినిమా తర్వాత విశ్వక్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దీనితో అతని నెక్ట్ మూవీస్ పైన ఈ ఇంపాక్ట్ బాగా పడింది. దీనితో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి.. ఈ సినిమాపై భారీ అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత మాత్రం.. మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జూన్ 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్ లో ఏ టాక్ సంపాదించుకున్న కూడా ఓటీటీ లో మాత్రం ఆయా సినిమాలకు మంచి బజ్ ఏ వస్తుంది. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

Gangs of Godavari movie has come to OTT

ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కథ విషయానికొస్తే.. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన వ్యక్తి విశ్వక్.. అతను ఓ అనాధ. దీనితో దొంగతనాలు చేస్తూ గాలికి తిరుగుతూ ఉంటాడు. ఎవరినైనా వాడుకుని ఎదగాలి అనే మనస్తత్వం అతనిది. ఈ క్రమంలో అతనికి ఆ ఏరియాలో జరుగుతున్న ఇసుక దందా గురించి తెలుస్తుంది. ఆ ఇసుక మాఫియా వెనుక ఆ ఊరి ఎమ్మెల్యే ఉన్నాడని తెలుసుకుని అతనికి దగ్గరవుతాడు. ఈ క్రమంలోనే అతని శత్రువు కూతురుకి కూడా దగ్గరయ్యి.. ఆమెను ప్రేమలో పడేస్తాడు. అలా వాళ్ళందరిని మాయ చేసి తానే ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ! అందరిని ఇలా వాడుకున్న రత్నాకర్ పై ఆ ఊరి ఎమ్మెల్యే ఎలా పాగా సాధించాడు ! అతను ప్రేమ కథ ఎంత వరకు కొనసాగుతుంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాలను చూడాల్సిందే. మరి ఈ వీకెండ్ ఈ సినిమాను మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ఎంచక్కా ఈ మూవీని ఎంజాయ్ చేసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabet