iDreamPost

Gandeevam : అక్కినేనితో బాలయ్య ఫలితం రాలేదయ్యా

ఓ ఉదాహరణ చూద్దాం. 90 దశకం. బాలకృష్ణ మంచి ఊపు మీదున్న సమయం. లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్ పెక్టర్ ఆయన ఫాలోయింగ్ ని మాస్ లో మరింత బలపరచగా నారి నారి నడుమ మురారి, ఆదిత్య 369 ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసింది

ఓ ఉదాహరణ చూద్దాం. 90 దశకం. బాలకృష్ణ మంచి ఊపు మీదున్న సమయం. లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్ పెక్టర్ ఆయన ఫాలోయింగ్ ని మాస్ లో మరింత బలపరచగా నారి నారి నడుమ మురారి, ఆదిత్య 369 ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసింది

Gandeevam : అక్కినేనితో బాలయ్య ఫలితం రాలేదయ్యా

మల్టీ స్టారర్ కాంబినేషన్లు ఏ సీజన్లో అయినా క్రేజ్ ఉన్నవే. వయసు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి తెరమీద కనిపించడం అంటే అభిమానులకు ఆ కిక్కే వేరు. కానీ కొన్నిసార్లు ఈ అంచనాలే ఇబ్బందిగా మరి దర్శకులు వాటిని సరిగా డీల్ చేయలేక బోర్లా పడిన సందర్భాలు ఉంటాయి. ఓ ఉదాహరణ చూద్దాం. 90 దశకం. బాలకృష్ణ మంచి ఊపు మీదున్న సమయం. లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్ పెక్టర్ ఆయన ఫాలోయింగ్ ని మాస్ లో మరింత బలపరచగా నారి నారి నడుమ మురారి, ఆదిత్య 369 ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసింది. ధర్మక్షేత్రం, అశ్వమేధం, నిప్పురవ్వ నిరాశపరిచినప్పటికీ బంగారు బుల్లోడు మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. రిస్క్ చేసిన భైరవ ద్వీపం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి కెరీర్ బెస్ట్ లో ఒకటిగా నిలిచిపోయింది

ఆ సమయంలో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెలుగులో ఒక స్ట్రెయిట్ మూవీ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. అప్పటికే నాగార్జున – అమల కాంబినేషన్ లో తీసిన నిర్ణయం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈసారి ఇంకా భారీగా ప్లానింగ్ చేసుకున్నారు. ఆర్టిస్ట్ కం రైటర్ హనీఫా ఇచ్చిన కథతో అక్కినేని నాగేశ్వరరావు – బాలకృష్ణ కలయికలో క్రేజీ కాంబోని సెట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ అంతకు ముందే భార్యాభర్తల బంధంలో కలిసి నటించారు. సత్యంబాబు శ్యామ్ కుమార్ నిర్మాతలుగా ప్రాజెక్టుని అనౌన్స్ చేసినప్పుడే పెద్ద హైప్ వచ్చేసింది. సత్యానంద్ సంభాషణలు సమకూర్చగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. రోజా హీరోయిన్ గా, బ్రహ్మానందం-నగేష్- కెప్టెన్ రాజు- గిరిబాబు-అల్లు రామలింగయ్య-చలపతిరావు – శ్రీవిద్య-రూపిణి తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు.

కోటీశ్వరుడైన చక్రవర్తికి పిల్లలు ఉండరు. అతని శత్రువు మైకేల్ ప్లాన్ ప్రకారం ముగ్గురిని అతని సంతానంగా అక్కడికి వెళ్లేలా చేస్తాడు. అయోమయం చెందిన చక్రవర్తికి, రాజాకు మధ్య ఉన్న నిజమైన బంధమే అసలు స్టోరీ పాయింట్. లైన్ బాగున్నప్పటికీ దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రియదర్శన్ పడిన తడబాటు గాండీవంని దెబ్బ తీసింది. రాజేంద్రప్రసాద్ లాంటి కామెడీ హీరో చేయాల్సిన క్యారెక్టర్ ని బాలయ్య చేయడంతో జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. 1994 ఆగస్ట్ 18 విడుదలైన గాండీవం ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. గోరువంక వాలగానే పాట ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్. ఇందులోనే మోహన్ లాల్ అలా తళుక్కున రెండు మూడు షాట్స్ లో డాన్స్ చేసి మెప్పిస్తారు. సిరిసిరిపూల చెల్లాయి పాప గీతం కూడా కీరవాణి బెస్ట్ ట్రాక్స్ లో ఒకటిగా చెప్పొచ్చు

Also Read : Neramu Siksha : తెలిసి చేసిన తప్పు సరిదిద్దుకోవడం ఎలా – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి