iDreamPost

గామి సినిమాకి సూపర్బ్ అడ్వాన్స్ బుకింగ్స్

  • Published Mar 07, 2024 | 1:39 PMUpdated Mar 07, 2024 | 1:39 PM

విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గామి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే ఈ మూవీ అడ్బాన్స్ బుకింగ్ విపరీతంగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి.

విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గామి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే ఈ మూవీ అడ్బాన్స్ బుకింగ్ విపరీతంగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి.

  • Published Mar 07, 2024 | 1:39 PMUpdated Mar 07, 2024 | 1:39 PM
గామి సినిమాకి సూపర్బ్ అడ్వాన్స్ బుకింగ్స్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం గామి. గతవారం విడుదలయిన ట్రైలర్‌తో ప్రేక్షకులలో అద్భుతమైన బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌లోని అసాధారణమైన విజువల్స్ తో పాటు ఆసక్తికరమైన కాన్సెప్ట్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందువల్లే ఈ సినిమాని థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఆసక్తి అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలో కనిపిస్తుంది. గామి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్బ్ రేంజ్ లో ఉన్నాయి. సంక్రాంతి సీజన్ తరువాత తెలుగు సినిమా ఈ ఏడాది సరైన హిట్ సినిమా చూడలేదు. ఒక పెద్ద హిట్ లేక బాధపడుతున్న టాలీవుడ్‌కి గామి సినిమాకి వస్తున్న హైప్ ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి.

అయితే ఇప్పుడున్న టికెట్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే గామి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టాక్ గనక వస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూఎస్ ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్‌ సేల్స్ చూస్తే గామి సినిమా ఇప్పటికే $70K ఫిగర్ ను దాటేయగా కేవలం ప్రీమియర్‌ షోస్ నుంచే $150K ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పైన చెప్పుకున్న విధంగా ఒకవేళ మౌత్ టాక్ కూడా పాజిటివ్‌గా ఉంటే మొదటి రోజు కలెక్షన్లలో మ్యాట్ని షో నుంచి నంబర్లలో భారీ జంప్ ఉంటుంది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో, గామి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోని ఫేమస్ పీసీక్స్ స్క్రీన్ టికెట్ల కోసం చాలా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన గామి మాస్ సెంటర్లలో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ట్రేడ్ వర్గాల ప్రకారం గామి సినిమా వరల్డ్ వైడ్ ధియేట్రికల్ బిజినెస్ 12 కోట్లకి జరిగింది. సినిమాకి తొలి రోజు పాజిటివ్ టాక్‌ వస్తే బట్టి మూడు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ మార్కును సాధించే అవకాశం ఉంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏ సర్టిఫికేట్‌తో పొందింది. కాగా రన్‌టైమ్ 148 నిమిషాలు. ప్రత్యూష్ వత్యంతో పాటు స్క్రీన్‌ప్లే రాసిన నూతన దర్శకుడు విద్యాధర్ కాగిత తీసిన గామి సినిమా అద్భుతమైన విజువల్స్ తో పాటు గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిందని, ఖచ్చితంగా ప్రేక్షకులకి ఒక మరిచిపోలేని అనుభూతి ఇస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. మరి వారి నమ్మకం నిజమై సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి