iDreamPost
android-app
ios-app

సూర్య-జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తోన్న కార్తీ మాటలు

  • Published Sep 24, 2023 | 5:09 PM Updated Updated Sep 24, 2023 | 5:09 PM
  • Published Sep 24, 2023 | 5:09 PMUpdated Sep 24, 2023 | 5:09 PM
సూర్య-జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తోన్న కార్తీ మాటలు

సినిమా ఇండస్ట్రీలో.. ప్రేమ, పెళ్లి అనే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు అనే అభిప్రాయం ఉంది. కానీ కొన్ని జంటలు మాత్రం.. ఇండస్ట్రీ వారికే కాక.. మిగతా వారికి కూడా ఆదర్శంగా నిలుస్తారు. అలా కోలీవుడ్లోనే కాక.. సౌత్‌ ఇండస్ట్రీలోని మోస్ట్‌ లవబుల్‌ కపుల్స్‌ జాబితాలో ముందు వరుసలో నిలుస్తారు సూర్య-జ్యోతికల దంపతులు. అభిమానులు వారిని ఎంతో ప్రేమగా అన్నావదినలుగా పిలుచుకుంటారు. సూర్య-జ్యోతికల వివాహం అయిన నాటి నుంచి.. వీరు ఉమ్మడి కుటుంబంలోనే కలిసి ఉంటున్నారు.

అయితే కొన్ని రోజుల క్రితమే.. సూర్య-జ్యోతికలు ముంబైకి మకాం మార్చారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నారు. దాంతో.. వీరిద్దరూ వేరు కాపురం పెట్టడం కోసమే ముంబై వెళ్లారని జోరుగా ప్రచారం సాగింది. అంతేకాక ఎన్నో ఎళ్లుగా కలిసి ఉ‍న్న కుటుంబంలో జ్యోతిక వల్లనే విబేధాలు వచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక కొందరైతే సూర్య-జ్యోతికల పెళ్లి సమయంలోనే.. సూర్య తండ్రి శివకుమార్‌ ఓ కండిషన్‌ పెట్టారట. వివాహం తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించకూడదని చెప్పారట. కానీ ప్రస్తుతం జ్యోతిక సినిమాల్లో నటించడం.. దానికి సూర్య మద్దతు ఇవ్వడంతో.. అది శివకుమార్‌కు నచ్చలేదని.. దాంతో కుటుంబంలో గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయని.. ఆ సమయంలో కార్తీ కూడా తన అన్నకు మద్దతు ఇవ్వలేదంటూ తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.

గొడవలపై స్పందించిన కార్తీ..

సూర్య-జ్యోతిక ముంబై వెళ్లడంతో.. వారి కుటుంబం మీద రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి. అయినా సరే ఈ వార్తలపై ఇప్పటి వరకు వారి కుటుంబంలో ఎవరు స్పందించ లేదు. కానీ వీరు విడిపోవడానికి ప్రధాన కారణం జ్యోతికనే అంటూ సోషల్‌ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తుండటంతో.. తాజాగా ఈ వార్తలపై కార్తీ స్పందించాడు. అసలు విషయం చెప్పుకొచ్చారు.

‘‘మా అన్నతో వివాహం అయిన దగ్గర నుంచి నేను జ్యోతికను ఎప్పుడూ ఒక నటిగా చూడలేదు. నేను తనను అమ్మలానే భావించాను. తను కూడా మమ్మల్ని తన పిల్లలు మాదిరిగానే చూసింది. అమ్మ ఇప్పుడు ముంబైలో ఉండటంతో ఇ‍ల్లు అంతా బోసిపోయి ఉంది. ఆమె లేని ఈ ఇంట్లో ఉండటం మా వల్ల కావడం లేదు. అమ్మతో (జ్యోతిక) కలిసి ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘‘పైగా మేమంతా ఇన్నేళ్లపాటు కలిసి ఉంటున్నామంటే అందుకు ప్రధాన కారణం మా అమ్మ జ్యోతికనే. కానీ వారు ముంబై వెళ్లడానికి కారణం.. అన్నయ్య పిల్లలు పెద్ద వాళ్లు అవుతున్నారు. వారి చదువుల కోసం మాత్రమే అన్నావదిన ముంబై వెళ్లారు. వారి చదువులు పూర్తి అయిన తర్వాత తప్పకుండా మళ్లీ మేమందరం కలిసే ఉంటాం. ఈలోపు ప్రతి పండుగకు కలుస్తూనే ఉంటున్నాము’’ అని చెప్పుఒకచ్చాడు కార్తీ. జ్యోతిక గురించి సూర్య సోదరుడు కార్తీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా వారు విడిపోయారంటూ వచ్చిన వార్తలకు కూడా చెక్‌ పెట్టినట్లు అయ్యింది.

Jojobet GirişmeritbetmeritbetTophillbet girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetcasibomMadridbetMadridbetcasibom girişmadridbet girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet Şikayet