iDreamPost

వీడియో: విరాట్‌ కోహ్లీతో మ్యాక్స్‌వెల్‌ మాజాక్‌! ప్లాన్‌లో భాగమేనా?

  • Published Nov 19, 2023 | 5:06 PMUpdated Nov 19, 2023 | 5:06 PM

140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకుంటూ.. టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌కు చేరింది. తుదిపోరులో ఆస్ట్రేలియాతో టైటిల్‌ కోసం పోరాడుతోంది. అయితే.. ఈ ఫైనల్‌ పోరులో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ మధ్య ఒక ఫన్నీ సంఘటన జరిగింది. కానీ, దీని వెనుక కూడా ఒక ప్లాన్‌ ఉందనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకుంటూ.. టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌కు చేరింది. తుదిపోరులో ఆస్ట్రేలియాతో టైటిల్‌ కోసం పోరాడుతోంది. అయితే.. ఈ ఫైనల్‌ పోరులో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ మధ్య ఒక ఫన్నీ సంఘటన జరిగింది. కానీ, దీని వెనుక కూడా ఒక ప్లాన్‌ ఉందనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 19, 2023 | 5:06 PMUpdated Nov 19, 2023 | 5:06 PM
వీడియో: విరాట్‌ కోహ్లీతో మ్యాక్స్‌వెల్‌ మాజాక్‌! ప్లాన్‌లో భాగమేనా?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా.. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ ఫైట్‌ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న టీమిండియా ఫైనల్లో కాస్త తడబడుతోంది. రోహిత్‌ శర్మ వేగంగా ఆడినా.. గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ విఫలం కావడం, పిచ్‌ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేకపోవడంతో టీమిండియా పరుగులు చేయడానికి చెమటలు చిందిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. వెంటవెంటనే వికెట్లు పడిన తర్వాత.. కేఎల్‌ రాహుల్‌తో కలిసి భాగస్వామ్యం నిర్మించాడు. అక్కడి నుంచి కాస్త కోలుకున్నట్లు కనిపించింది భారత ఇన్నింగ్స్‌.

అయితే.. మ్యాచ్‌ మధ్యలో భారత్‌-ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ మధ్య ఓ ఫన్సీ ఘటన చోటు చేసుకుంది. వికెట్‌ కీపర్‌కి బాల్‌ అందించే క్రమంలో కోహ్లీకి త్రో వేశాడు మ్యాక్సీ.. తనకు తగటబోయే బాల్‌ను కోహ్లీ చేతితో పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు భుజాలు భుజాలు గుద్దుకుంటూ.. నవ్వులు చిందించారు. వీటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా వీళ్లిద్దరూ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఆడతారనే విషయం తెలిసిందే. అయితే.. ఈ నవ్వుల వెనుక ఆస్ట్రేలియా మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు తెలుస్తుంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియాపై విరాట్‌ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉందన్న విషయం ఆసీస్‌ ఆటగాళ్లకు కూడా బాగా తెలుసు. చాలా సందర్భాల్లో ఆస్ట్రేలియా అంటే చాలా కోహ్లీ రెచ్చిపోయి ఆడతాడు. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీ హాఫ్‌ సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే.. ఆస్ట్రేలియా అంటే స్లెడ్జింగ్‌కు మారుపేరని అందరికీ తెలిసిందే. కానీ, కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న టైమ్‌లో ఆస్ట్రేలియాను స్లెడ్జ్‌ చేసేవాడు. అందుకే.. ఫీల్డ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతనిని ఎవరూ ఏం అనొద్దని, అతన్ని గెలికితే రెచ్చిపోయి ఆడతాడని ఒక్కప్పటి వాళ్ల కోచ్‌, ఆసీస్‌ ఆటగాళ్లను హెచ్చరిన సంగతి చాలా మంది క్రికెట్‌ అభిమానులకు తెలుసు. ఆ హెచ్చరికను ఈ ఫైనల్‌లో కూడా ఆసీస్‌ ఆటగాళ్లు కొనసాగించినట్లు అర్థమైంది.

భారత్‌ కష్టాల్లో ఉన్న సమయంలో కోహ్లీ అద్భుతంగా ఆడుతున్న సమయంలో ఆసీస్‌ స్లెడ్జింగ్‌కు కాకుండా కోహ్లీతో సరదాగా ఉండేందుకు ప్రయత్నించారు. అలాగే ఉంటే కోహ్లీ కూల్‌గా ఉండి, రాంగ్‌ షాట్‌ ఆడతాడని వాళ్లు భావించినట్లు ఉన్నారు. అలా కాకుండా కోహ్లీ గెలికి ఏమైనా అంటే.. మరింత అగ్రెసివ్‌గా ఆడి.. బౌండరీలతో విరుచుకుపడతాడని వాళ్లకు తెలుసని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ అదే ఆసీస్‌ ప్లాన్‌ అయితే.. వాళ్లు సక్సెస్‌ అయినట్లే.. ఫిఫ్టీ పూర్తి చేసుకుని బాగా ఆడుతున్న కోహ్లీ షార్ట్‌ పిచ్‌ బాల్‌ను డిఫెన్స్‌ ఆడే క్రమంలో ప్లేయడ్‌ఆన్‌ అయిపోయాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి