iDreamPost

రణరంగంగా ఢిల్లీ.. అసలు రాజధానిలో ఏమి జరుగుతోంది?

Farmers Protest: ఢిల్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Farmers Protest: ఢిల్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రైతు సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వస్తున్న పంజాబ్, హర్యానా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రణరంగంగా ఢిల్లీ.. అసలు రాజధానిలో ఏమి జరుగుతోంది?

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే వాటి తీవ్రతను బట్టి వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించిన నిరసన కార్యక్రమాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. గతంలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అలానే అంతక  ముందు ఉత్తరాధి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం క్రితం పంజాబ్, హర్యాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు కూడా  చెలరేగాయి. తాజాగా మరోసారి అక్కడి రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం రణరంగంగా మారింది.

తమ వ్యవసాయ పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో సహా మరో 20 డిమాండ్ల పరిష్కారం కోరుతూ రైతన్నలు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఇక రైతులు చేపట్టిన ఈ యాత్రలో ఢిల్లీ సరిహద్దులో యుద్ధ వాతావరణ నెలకొంది. ముట్టడికి బయల్దేరిన రైతు సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా హర్యాణ, ఢిల్లీ పోలీసులు దేశ రాజధానికి వచ్చే అన్ని మార్గాలను మూసివేసేశారు. ఎక్కడిక్కడ బారికేడ్లు, కాంక్రిట్ దిమ్మెలు పెట్టి, ఇనుప కంచెలు, మేకులు అమర్చి.. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయినాసరే రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అష్టదిగ్భందాలను దాటుకుని రాజధానిలోకి అడుగుపెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సంభూ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అయినా సరే ఆందోళనకారులు వెనక్కితగ్గడం లేదు.

ఇక డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించే దృశ్యాలు సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగంతో చెల్లాచెదురైన నిరసన కారులు, అంబాల హైవేపైకి చేరారు.  ఇకర రైతులు చేపట్టిన ఢిల్లీ ఛలో ప్రభావంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఢిల్లీలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో పోలీసులు మోహరించి, తనిఖీలు చేస్తుండటంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. వాహనాలు నత్తనడక సాగుతున్నాయి. కిలో మీటర్ దూరం  ప్రయాణించేందుకు గంటల సమయం పడుతోందని స్థానిక వాహనదారులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.

రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమాని భగ్నం చేసేందుకు ఢిల్లీకి వెళ్లే అన్ని ప్రధాన మార్గాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సింగూ, టిక్రిలతో పాటు ఘజియాబాద్, యూపీ నోయిడా సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్, చిల్లా వద్ద పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక భారీ ట్రాఫిక్ జామ్ పై పోలీసులు కూడా స్పందించారు. తాము దారులన్ని పూర్తిగా మూసేయలేదని, ఫెన్సింగ్ లో పాక్షింకంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు. అలాగే అత్యవసర  వస్తువులను సైతం అనుమతిస్తున్నట్లు  పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఆందోళనకు తరలివెళ్తున్న రైతుల్ని పంజాబ్ పోలీసులు అనుమతిస్తున్నారు.

ఇక ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం..కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాలకు జరిగిన చర్చలు విఫలం కావడం. కనీస మద్దతు ధరకు భరోసా కల్పించేలా చట్ట చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పంటరుణాల మాఫీ, రైతులు- రైతుకూలీలకు ఫించన్లు ఇవ్వడం వంటి పలు ఇతర అంశాలను కేంద్రం అమోదించాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే గతంలో నిరసన కార్యక్రమాల్లో తమపై పెట్టిన కేసులను కొట్టేయాలని, అలాగే మరో 20 డిమాండ్లను రైతులు కేంద్రంకి విన్నవించారు.

సోమవారం నాడు చంఢీగఢ్ వేదికగా రైతులకు, కేంద్రంకి మధ్య అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. యాత్రను విరమించుకోవాలని కేంద్రం రైతు సంఘాల నాయకులతో సూచించింది.  కేంద్ర మంత్రులు పీయూష్ గోయాల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వం బృందం, రైతుల  ప్రతినిధులతో చర్చలు జరిపింది. వ్యవసాయ చట్టాలకు సంబంధించి 2020-21లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వీటిలో.. 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది.

అయితే ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. దానిపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. ఈక్రమంలోనే కేంద్రం, రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలం  కావడంతో ముందుగానే అనుకున్నట్లు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులు సిద్ధమయ్యారు. ‘ఛలో ఢిల్లీ’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి రైతులు భారీ స్థాయిలోనే కదిలారు. పంజాబ్, హర్యాణ, యూపీతో సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు దేశ రాజధాని వైపు కదిలారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. మరి.. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి