మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలంటూ గత ఏడాది నవంబర్ 26న మొదలయిన రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చలి, వాన, ఎండ తేడా లేకుండా రైతులు పోరాడుతూనే ఉన్నారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో ఉధృత రూపం దాల్చిన ఈ ఉద్యమం ఆ తర్వాత కొంత శాంతించినట్టు కనిపించింది. కానీ యూపీ, హర్యానా సహా వివిధ రాష్ట్రాల్లో విస్తృతమయ్యింది. ముఖ్యంగా జాట్ల నాయకుడు రాకేష్ తికాయత్ చొరవ తో కిసాన్ పంచాయత్ ల తాకిడి కనిపించింది. […]
సాగు చట్టాలను రద్దు చేయాలని నాలుగు నెలలుగా నిరసన చేస్తున్నా.. పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సాగు చట్టాల రద్దు కోరుతూ అన్నదాతలు మరోమారు భారత్ బంద్‌తో కదం తొక్కుతున్నారు. ఇప్పటికే ఒకసారి భారత్ బంద్‌ను నిర్వహించిన అన్నదాతలు ఈ రోజు మరోమారు భారతావనిని స్తంభింపజేశారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలు.. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పాండిచ్చెరి, కేరళ మినహా.. మిగతా భారతావనిలో బంద్ జరుగుతోంది. బీజేపీయేతర పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు మద్ధతుగా […]
నూతన సాగు చట్టాలను రద్దు చేయడం, పంటల కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో రైతులు చేస్తున్న ఉద్యమం గణతంత్ర దినోత్సవం తర్వాత మరో దశకు చేరిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో భైటాయించిన రైతులు శాంతియుతంగా నిరసన తెలపగా.. ఇప్పుడు ప్రత్యక్ష పోరు సాగిస్తున్నారు. వివిధ మార్గాల్లో తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మహా పంచాయత్‌లు, ఖాఫ్ పంచాయత్‌లు నిర్వహిస్తున్న రైతు సంఘాల నేతలు, భారతీయ కిసాన్ యూనియన్నేత రాకేష్ […]
పట్టు పట్టరాదు.. పట్టు విడువరాదు.. అన్నట్లుగా నూతన సాగు చట్టాల రద్దుపై అన్నదాతలు ఉద్యమం సాగిస్తున్నారు. చట్టాల రద్దు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధతే తప్పా.. మరే ఇతర ప్రతిపాదనలను రైతులు అంగీకరించడం లేదు. సాగు చట్టాలను ఏడాదిన్నరపాటు వాయిదా వేసి, సమస్య పరిష్కారం కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. 10వ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర ఈ ప్రతిపాదన చేయగా.. చర్చించి నిర్ణయం చెబుతామని […]
నూతనంగా తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు నెలలుగా రైతులు చేస్తున్న ఉద్యమం కొలిక్కి వస్తోంది. చట్టాలను రద్దు చేయాలని రైతులు… సవరణలు మాత్రమే చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టుబట్టాయి. రెండు నెలలు కావస్తున్నా.. రైతులు తమ పట్టు వీడకపోవడం, శాంతియుతంగా నిరసన తెలుపుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగరాకతప్పడం లేదు. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని […]
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు శాంతియుంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఇప్పటికి 9 సార్లు చర్చలు జరిగినా ఫలితం లేదు. చట్టాలు రద్దు చేయాలని రైతులు, అది తప్పా సవరణలు చేసేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం.. ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి రైతులు చలిలోనే ఉంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నా.. […]
తాడో పేడో తేల్చుకోమంటారు..పెద్దలు. అంతేకాదు అదే సమయంలో తెగేదాకా లాగొద్దని చెబుతారు ఆ పెద్దలే..అంటే అర్దం సందర్భాను సారం..నిర్ణయం తీసుకోవాలని అర్దం.. అంతేకాని తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చింది కాబట్టు తాము పట్టిన కుందేటికి ముూడేకాళ్లు అనడం సరైంది కాదన్నది దాని పరోక్ష హెచ్చరిక..ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ప్రపంచాన్ని కదిలించిన రైతు పోరాటం సుప్రీం తీర్పుతో చివరి దశకు చేరిందనే చెప్పాలి. రైతు ఉద్యమంపై సుప్రీం కోర్టు స్పందించి తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు కేంద్రాన్ని […]
కాలానికి లెక్కలు తెలియవు. తేదీలు, సంవత్సరాలు మనం కౌంట్ చేయాల్సిందే. అలల్లా కాలం కదులుతూనే వుంటుంది. కొత్త ఏడాది వచ్చి రెండు రోజులైంది. ఏమీ జరగదు, ఏదీ అంత సులభంగా మారదు, కానీ ఏదో ఆశ. నా చిన్నతనంలో అన్ని రోజుల్లానే జనవరి ఫస్ట్ కూడా. మామూలు జనం పట్టించుకునే వాళ్లు కాదు. 1971 జనవరి ఫస్ట్ నాటికి నేను ఐదో తరగతి. న్యూ ఇయర్ అని మా చిన్నాన్న కొంచెం హడావుడి చేశాడు. అప్పటికి ఆయన […]
దాదాపు 30 రోజులకు పైగా రాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం హోరాహోరీగా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ తీవ్రమవుతోంది. రైతుల రాక పెరుగుతోందని, ఆ సంఖ్య ఇంకా పెరిగితే కట్టడి కష్టమని ఓ దశలో పోలీసులు కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రోజూ వందల మంది వచ్చి ఉద్యమంలో చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 3వేల మంది రైతులు బైక్‌లు, చిన్న చిన్న క్యాబ్‌ల్లో ఢిల్లీకి యాత్రగా వచ్చారు. రైతులకు కేంద్రం మరోసారి వర్తమానం […]
సోషల్ మీడియా.. సంప్రదాయ మీడియాకు భిన్నమైన వైఖరితో ప్రతి అంశాన్ని క్షణాల వ్యవధిలోనే లక్షలాది మందికి చేరవేస్తున్న సాధనం. వ్యతిరేకంగా వచ్చే ఆరోపణల విషయం పక్కన పెడితే. చీకట్లో ఉండిపోవాల్సిన అనేకానేక గొంతులకు ఇప్పుడు ఈ సరికొత్త మీడియా సాధనం వేదికగా నిలుస్తోంది. అనేక సమస్యలను ఈ మీడియం ద్వారా వెలుగులోకి రావడంతో పాటు, అనేక సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తోందనే చెప్పాలి. ఎక్కడైనా చిన్నారులు తప్పిపోయిన వారిని వారి కుటుంబీకులకు చేర్చడం దగ్గర్నుంచి ప్రస్తుతం ఢిల్లీలో […]